Home Unknown facts కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

0

ఇండియాలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ బయటపడ్డాయి ఒకటి ఢిల్లీలో మరొకటి తెలంగాణాలో. ఇంకా మన దేశంలో విస్తురంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదు గాని మనము కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే క్షేమంగా ఉండగలము. అసలు ఈ వైరస్ ముఖ్య లక్షణాలు ఏంటో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?

కరోనా వైరస్ ముఖ్య లక్షణాలు:

1) ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి

Carona Virus2) కరోనా వైరస్ కేవలం డైరెక్ట్ కాంటాక్ట్ వల్లనే వ్యాపిస్తుంది అందుకే జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకి కనీసం 3 అడుగులు దూరం ఉండేలా చూసుకోవాలి.

3) తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు:

అతి ముఖ్యంగా చేతులు శుభ్రంగా సోప్ తో కడుక్కోవాలి, పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలి.

4) తుమ్ముతున్న సమయంలో ముక్కుకు టిష్యూ లేదా మాస్క్ పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

5) ఒకవేళ గర్భవతులుకి ఈ వైరస్ సోకుంటే అది పిల్లలకి వ్యాపిస్తుందా లేదా అనే దాని పై ఇంకా సరైన సమాచారం లేదు.

6) ఇప్పటిదాకా అయితే దీనికి ఇంకా మెడిసిన్ లేదు, కేవలం సరైన ఆహార పదార్థాలు, జ్వరం దగ్గు ఉన్న వారికి కాస్త దూరంలో ఉండడం, ఒకవేళా ఆ లక్షణాలు మీకు ఉంటే వెంటనే చెక్ చేయించుకోడం లాంటివి చెయ్యాలి అన్నిటికన్నా ముఖ్యంగా మీ శరీరాన్ని, పరిసార్లన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి.

Exit mobile version