Home Unknown facts శరన్నవరాత్రులలో అమ్మవారి అవతారాలు??

శరన్నవరాత్రులలో అమ్మవారి అవతారాలు??

0

”నవ” అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయ దశమిని జరుపుకుంటారు. మరో కధనం ప్రకారం మహిషాసురుడిని సంహరించినందుకు దసరా జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీ రాముడు వధించాడని పురాణాలు చెప్తుంటాయి. తొమ్మిది రోజుల్లో అమ్మవారు ధరించే తొమ్మిది రూపాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

శ్రీ బాలాత్రిపుర సుందరి:

balatripura sundariఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి.

శ్రీ గాయత్రి దేవి అలంకారం:

ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది.

శ్రీ మహాలక్ష్మి తేది :

3వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది.

శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి:

నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది.

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి :

5వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి’గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు చక్రయంత్రాన్ని ప్రతిష్టించాక పరమశాంత రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది.

శ్రీ మహా సరస్వతీ దేవి:

ఆరవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది.

శ్రీ దుర్గా దేవి అలంకారం:

ఏడవ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు’ అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కాబట్టి ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కాబట్టి దేవిని ‘దుర్గా’ అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారు.

శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం:

8వ రోజున మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది.

శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం:

9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత’ అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ’ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది.

Exit mobile version