Home Unknown facts ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన పాదముద్రలు ఎవరివి ?

ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన పాదముద్రలు ఎవరివి ?

0

మన హిందూ పురాణాల ప్రకారం కొందరు కొన్ని యుగాల నుండి ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరు మృత్యుంజ‌యులని వీరికి అసలు మరణం అనేది లేకుండా ఎప్పుడు చిరంజీవులుగానే ఉంటారని పురాణాలూ చెబుతున్నాయి. భ‌క్తుల‌ను కాపాడే క‌లియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయ‌న కూడా మృత్యుంజ‌యుడే. ఈయన ఎప్పటికి చిరజీవుడే అని చెబుతారు. మరి ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన పాదముద్రలు ఎవరివి? యతి అంటే హనుమంతుడేనా? మంచుకొండల్లో నివసించే ఆ జీవి ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mysterious Footprints Yeti

హిమాలయాల్లో భారత సరిహద్దుల్లో ఉండే ఇండియన్ ఆర్మీ ఏప్రిల్ 9 వ తేదీన మంచులో పాదముద్రలను గుర్తించి ఫోటోలు తీశారు. ఆ పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండగా పాదముద్రల ప్రకారం ఆ జీవి 30 అడుగుల ఎత్తు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక పాదముద్రలు యతివి అని కొందరు, మంచు మనిషివి అని కొందరు నమ్మితే లేదు అవి హనుమంతుడి పాదముద్రలు అంటూ నమ్ముతున్నారు.

ఇక యతి ఏంటనే విషయానికి వస్తే, మంచు కొండల్లో సంచరించే భారీ శరీరం, పెద్దగా ఉండే పాదాలు, భయానక దంతాలు, శరీరం అంతాకూడా తెలుపు రంగు జుట్టు లేదా బూడిద రంగులో పెద్ద ఎలుగుబంటి, చింపాంజీ ఆకారాలు కలసి ఉండేలా ఉంటుందని చెబుతారు. అయితే కొందరి పరిశోధకులు చెప్పిన దానిప్రకారం యతి అనేది వానర జాతికి చెందినదని, సుమారు 40 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జీవి ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన జీవి అంటూ చెప్పారు.

ఇది ఇలా ఉంటె, ఒకటవ శతాబ్దంలో యతి ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. నేపాల్ లోని షెర్బా తెగకి చెందిన పురాణాల్లో కూడా యతి గురించి వివరించారు. ఇక 1921 లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన చార్లెస్ హోవార్డ్ తనకి భారీ పాదముద్రలు కనిపించాయని అవి బహుశా ఎలుగుబంటి లాంటి మంచు మనిషివి అయిండొచ్చు అని భావించాడు. ఆ తరువాత ఎందరో యతి గురించి ప్రస్తావించినప్పటికీ ఎవరు కూడా ఇప్పటివరకు ఆ మిస్టరీ ఏంటనేది తేల్చలేకపోయారు.

ఇక కొందరు తెల్లని జుట్టుతో అతి పెద్ద ఆకారంలో మంచు కొండల్లో సంచరించేది హనుమంతుడిని, ఎప్పుడు చిరంజీవిగా ఉండే వరం కారణంగా ఆ స్వామి ఇప్పటికి మంచు కొండల్లో తపస్సు చేసుకుంటున్నాడని, అందుకే పాదముద్రలు తప్ప స్వామివారు ఇప్పటికి ఎవరికీ కనిపించలేదని, యతి కూడా వానర జాతికి చెందినదిగా ఉండటంతో అవి హనుమంతుడి పాదముద్రలు అని కొందరి హిందువుల నమ్మకంగా చెబుతారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం, ప‌ర‌శురాముడు, విభీష‌ణుడు, బ‌లి చ‌క్ర‌వ‌ర్తి, మార్కండేయ మ‌హ‌ర్షి, అశ్వ‌త్థామ‌, వేద వ్యాసుడు, కృపాచార్యుడు చిరజీవులై కొన్ని యుగాల నుండి ఇప్పటికి బతికే ఉన్నారని, వీరు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నారని ఒక నమ్మకం ఉంది.

ఇక పురాణాల ప్రకారం ఆ వింత జీవి దేవుడని కొందరు, మంచులో బ్రతికే మంచు మనిషి అని కొందరు చెబుతుంటే మరికొందరు మాత్రం, అక్కడ ఎలాంటి జంతువు ఏమి లేదని, మనిషి మంచులో నడిచిన తరువాత వారి అడుగులే మంచు కరగడం వలన వ్యాకోచించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. యతి ఉన్నదా లేదని పక్కపెడితే, ఇండియన్ ఆర్మీ యతి అడుగులు చూశామని ట్వీట్స్ చేయడం తో ఎప్పటినుండో మిస్టరీగానే ఉన్న యతి మళ్ళీ తెరపైకి వచ్చి పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version