దేవుడు లోక కళ్యాణం కోసం కొన్ని అవతారాలు ఎత్తాడనీ చెబుతారు. మన పురాణాల విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన రావణుడిని సంహరించడానికి మానవ అవతారం ఎత్తాడనీ అదే రామావతారం అని చెబుతారు. ఇక వాల్మీకి వ్రాసిన రామాయణం కాకుండ ఇంకా ఎన్నో కథలు అనేవి వెలుగులో ఉన్నాయి. మరి ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ స్టాంపుని ఎందుకు విడుదల చేసిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తేత్రాయుగంలో రామాయణం జరుగగా రామాయణ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ వంటి దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. అయితే థాయిలాండ్ లో ఇప్పటికి రామరాజ్యమే ఉందని, శ్రీరాముని వంశానికి చెందినవారే అక్కడ రాజుగా కొనసాగుతున్నారని చెబుతున్నారు.
ఇక విషయంలోకి వెళితే, భారత్ – ఇండోనేషియా 70 యేళ్ళ దౌత్య సంబంధాలను పురస్కరించుకొని ఇండోనేషియా ప్రభుత్వం ఏప్రిల్ 24 వ తేదీన రామాయణ స్టాంపుని విడుదల చేసింది. రామాయణంలో రావణుడు, సీతాదేవిని అపహరించుకొని వెళుతుండగా ఆకాశంలో ఉన్న జటాయువు రావణుడి అడ్డుకొనగా దాని రెక్కలు కండించడం వలన ఆ జటాయువు క్రింద పడిపోతుంది. రావణుడి బారి నుండి సీతాదేవిని రక్షించడానికి జటాయువు చేసిన పోరాటాన్ని ఇతి వృతంగా చేసుకొని ఈ స్టాంపుని రూపొందించారు. పద్మశ్రీ బాపక్ న్యోమన్ నుఅర్తా అనే గొప్ప ఇండోనేషియా శిల్పకారుడు ఈ స్టాంపుని రూపొందించాడు.