Home Unknown facts సుబ్రహ్మణ్యస్వామి వివాహానికి ముందు జరిగిన ఆసక్తికర సంఘటన గురించి తెలుసా ?

సుబ్రహ్మణ్యస్వామి వివాహానికి ముందు జరిగిన ఆసక్తికర సంఘటన గురించి తెలుసా ?

0

శివపార్వతుల కుమారుడు సుబ్రమణ్యస్వామి. ఈయనను దేవతల సేనాధిపతి అని అంటారు. సుబ్రమణ్యస్వామిని స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ అనికూడా పిలుస్తుంటారు. ఈ స్వామి యొక్క వాహనం నెమలి. లోకకల్యాణం కోసం జన్మించిన ఈ స్వామికి పార్వతి దేవి ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలనీ భావిస్తుంది. మరి పార్వతీదేవి ఎవరి కుమార్తెని తన ఇంటి కోడలు చేసుకోవాలనుకుంది? ఆ వివాహానికి ముందు జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Subramanya Swamyలక్ష్మీదేవి యొక్క కుమార్తె శ్రీవల్లి. అయితే ఒకానొక సందర్భంలో శ్రీవల్లిని చూసిన పార్వతీదేవి ఆమెని సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి వివాహం చేసి తన ఇంటి కోడలు చేసుకోవాలని భావిస్తుంది. ఎందుకంటే బుద్ధిమంతురాలు, మహాసౌందర్యవతి, పైగా సంపదల తల్లి తనయ శ్రీవల్లి.  అయితే పార్వతీదేవి ఇదే విషయాన్ని తన భర్త అయినా శివుడి దగ్గర ప్రస్తావిస్తే ఎలాంటి సమాధానం చెప్పకుండా శివుడు నవ్వి ధ్యానంలోకి వెళ్తాడు.

ఇక పార్వతీదేవి ఆలస్యం చేయకూడదని భావించి లక్ష్మి దేవి దగ్గరికి వెళ్లి తన మనసులోని మాట ఆమెకి చెప్పుతుంది. అప్పుడు లక్ష్మీదేవి, మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేస్తే మా అమ్మాయికి లభించేది  ఏముంది మంచుకొండ, రుద్రాక్షమాలలు, ఇంత విభూది అంతేనా  అని సమాధానం ఇవ్వగా ఆమె మాటలకూ పార్వతీదేవి కన్నీటి పర్యంతమై శివునికి విషయం చెప్పి విచారిస్తుంది.

అప్పుడు శివుడు తన ఒంటిమీది ఓ రుద్రాక్షనిచ్చి ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని ఇమ్మని అడుగు అని పంపిస్తాడు. పార్వతిదేవి శివుడిచ్చిన రుద్రాక్షతో లక్ష్మిదేవిని కలిసి, తన వచ్చిన పని చెబుతుంది. లక్ష్మిదేవి ఆ రుద్రాక్షను ఓ త్రాసు తెప్పించి తూచాలని చూసింది, తన ఒంటిమీది ఆభరణాలేకాదు, తన సంపదనంతా వేసి తూచినా ఆ రుద్రాక్ష తూగక పోయేసరికి ఆ సంపదల తల్లి ఖిన్నురాలైపోతుంది. అప్పుడు, ఇంకా ఇలాంటి రుద్రాక్షలు నా స్వామివద్ద ఎన్నో వున్నాయి అని పార్వతి అనేసరికి పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను షణ్ముఖునికిచ్చి వివాహం చేస్తుంది.

ఇలా ఒక ఆసక్తికర కథనం తరువాత లక్ష్మీదేవి కూతురు అయినా శ్రీవల్లిని సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి వివాహం జరిపించారు.

Exit mobile version