Home Unknown facts ఆశ్చర్యాన్ని కలిగించే శివుడు ధ్యానం చేసిన శ్రీ ఖండ్ మహాదేవ ఆలయం చరిత్ర

ఆశ్చర్యాన్ని కలిగించే శివుడు ధ్యానం చేసిన శ్రీ ఖండ్ మహాదేవ ఆలయం చరిత్ర

0

పరమ శివుడు కైలాసం లో కొలువై ఉంటాడని చెబుతారు. ఈ ప్రదేశాన్ని చూస్తే భూమి మీద ఇంతటి అద్భుతమైన, పవిత్రమైన ప్రదేశం ఉందా అనే ఆశ్చర్యం రాకా మానదు. ఎందుకంటే సముద్రమట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఈ అద్భుత ప్రదేశం ఉండగా అక్కడ 75 అడుగుల శివలింగం భక్తులని మంత్రముగ్దుల్ని చేస్తుంది. మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు? ఇక్కడ ఉన్న ఆశ్చర్యకర విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tallest Shiva Lingam Temple

హిమాచల్ ప్రదేశ్, సరహన్ లో శ్రీ ఖండ్ మహాదేవ ఆలయం ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 5100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పురాణాల ప్రకారం, పూర్వం ఆ పరమేశ్వరుడు ఇక్కడి పర్వతం పైనే ధ్యానం చేసాడని చెబుతారు. అందుకే ఈ స్థలాన్ని హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇంకా పాండవులు వనవాసంలో ఉన్నపుడు ఈ క్షేత్రానికి వచ్చి శివుడిని ఆరాదించారని తెలియుచున్నది.

ఇక పురాణానికి వస్తే, భస్మాసురుడు శివుడికి మహా భక్తుడు. ఒకసారి శివుడి కోసం భస్మాసురుడు ఘోర తపస్సు చేయగా, తన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యేక్షమై ఏదైనా వరం కోరుకోమని అనగా, అప్పుడు భస్మాసురుడు తనకి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకోగా, అమరత్వాన్ని ప్రసాదించడం అసంభవం అని చెప్పడంతో, నేను ఎవరి తల మీద చేయి పెడితే వారు భస్మం అవ్వాలని కోరడంతో శివుడు భస్మాసురుడికి ఆ వరాన్ని ఇస్తాడు. ఇలా వరాన్ని పొందిన భస్మాసురుడు ఎవరిమీదనో ఎందుకు శివుడి తల మీదనే చేయి పెట్టి చూస్తే పరీక్షిద్దామని అనుకోని శివుడి తల మీద చేయి పెట్టడానికి ప్రయత్నిస్తుండంతో శివుడు అక్కడి పారిపోతూ శ్రీ మహావిష్ణువు సహాయం అడుగగా, శ్రీమహావిష్ణువు మోహిని వేషంలో అక్కడి రావడంతో ఆ అందానికి ఆకర్షితుడైన భస్మాసురుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగగా, నాతో సరిపాటుగా నాట్యం చేసి మెప్పించి అప్పడు చేసుకుంటాని మోహిని చెప్పడంతో, నాట్యం చేస్తున్నపుడు భస్మాసురుడు తన చేతిని తన తలపైనే పెట్టుకునేలా చేయడంతో భస్మం అయిపోతాడు. ఈవిధంగా భస్మాసురుడి నుండి తప్పించుకున్న శివుడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ పర్వతం పైన తపస్సు చేసాడని పురాణం.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ పర్వతాన్ని చేరుకొని శివలింగాన్ని దర్శించడం అనేది అందరికి సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడి వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ పర్వత శిఖరాలపైనా మంచు లో వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా సంవత్సరంలో ఇక్కడి వెళ్ళడానికి పర్వత శిఖరంపైన అన్ని రోజులో వాతావరణం అనేది అనుకూలించదు అందుకే సంవత్సరంలో కేవలం జూన్ నెలలో మాత్రమే 15 నుండి 20 రోజులు మాత్రమే వెళ్ళడానికి అనుమతి అనేది ఉంటుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని కుళ్ళు జిల్లాలో ఈ ట్రెక్కింగ్ అనేది ప్రారంభం అవ్వగా మూడు నుండి నాలుగు రోజుల సమయంలో మొదటి క్యాంపు అనేది వస్తుంది, కాళీఘాట్ వద్ద రెండవ క్యాంప్, భీంద్వార్ వద్ద మూడవది, నాలుగవది పార్వతి భాగ్, ఇక చివరగా శ్రీ ఖండ్ కి చేరుకుంటారు.

ఇలా ప్రకృతి అందాల నడుమ, పర్వత శిఖరాలలో, మంచు కొండల పైన శివుడు ధ్యానం చేసిన ఈ పవిత్ర పుణ్యస్థలాన్ని దర్శించడం అనేది జీవితంలో మరువలేని ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

Exit mobile version