Home Unknown facts శ్రీశైలం అడవుల్లో ఉన్న అక్కమహాదేవి గుహ గురించి కొన్ని నిజాలు

శ్రీశైలం అడవుల్లో ఉన్న అక్కమహాదేవి గుహ గురించి కొన్ని నిజాలు

0

శ్రీకృష్ణుడిని వరించిన మీరాబాయిలా, శ్రీరంగనాధస్వామిని వరించిన గోదాదేవిలా, శ్రీశైల మల్లికార్జునస్వామిని భర్తగా భావించిన మహా భక్తురాలు అక్క మహాదేవి. ఇక శ్రీశైల అడవుల్లో అక్కమహాదేవి గుహలో ఏర్పడిన సహజ శివలింగ దర్శనం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. మరి అక్క మహాదేవి ఎవరు? అక్కమహాదేవి గుహల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Akka Mahadevi Caves

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా లో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు, సముద్రమట్టానికి దాదాపుగా 458 మీ. ఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జునస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మల్లికార్జునస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈవిధంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం.

ఇక శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో పడవలో ప్రయాణించి కొండరాళ్ళపైకి దిగి వెళితే అక్క మహాదేవి గుహలను చేరుకుంటారు. ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక దారి ఉంది. ఈ సొరంగం చివరలో శివలింగాకారంలో ఏర్పడిన శిలారూపం ఉంది. దీనినే సహజ శివలింగం అని అంటారు. అక్కమహాదేవి ఈ శివలింగాన్ని పూజించనది చెబుతారు.

ఇక పురాణం విషయానికి వస్తే, కర్ణాటక రాష్ట్రంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు అక్క మహాదేవి జన్మించినది. ఆమె తల్లితండ్రులు తమ బిడ్డ పార్వతీదేవి అంశగా భావించి ఆమెకి మహాదేవి అనే పేరు పెట్టారు. ప్రతి రోజు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పెరగసాగింది. అయితే ఆ ప్రాంతాన్ని పాలించే కౌశికుడు అనే మహారాజు ఒక రోజు మహాదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోవాలని భావించి మహాదేవి తల్లితండ్రుల దగ్గరికి సైన్యాన్ని పంపగా వారు వివాహానికి అంగీకరించకపోవడంతో వారిని భయపెట్టాడు. అప్పుడు మహాదేవి నేను పెట్టిన షరతులకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని, షరతులను ధిక్కరిస్తే రాజ్యం నుండి వెళ్లిపోతానని చెప్పగా ఆ రాజు వాటికీ అంగీకరించాడు.

ఇక షరతుల ప్రకారం మహాదేవి నిత్యం శివుడిని పూజిస్తూ ఉండగా ఒక రోజు రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె చీరని లాగి నీవు మహాభక్తురాలవు కదా నీకు వస్త్రములతో పని ఏమి అని అని ప్రశ్నించగా తన కేశాలనే వస్త్రముగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకొని ఆలా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. ఇక రాజ్యం నుండి బయటకి వచ్చిన మహాదేవి, అప్పటికే ప్రజలను భక్తి బాటలో నడిపిస్తున్న బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు భక్తుల కోసమా ఏర్పాటు చేసిన వేదికను చేరుకొని శివుడి మీద తనకి ఉన్న అభిప్రాయాలను చెప్పగా ఆమె పాండిత్యానికి ముగ్దులైన వారు ఆమెని అక్క అనే బిరుదుని ఇవ్వగా అలా మహాదేవి అక్కమహాదేవి అయినది.

ఆమె భక్తిని చూసి వారు ఆమెని శ్రీశైలానికి వెళ్లి మల్లికార్జునస్వామిని ధ్యానించమని సూచించగా అక్కమహాదేవి దట్టమైన అరణ్యప్రాంతంలో ఉన్న శ్రీశైలానికి వచ్చి స్వామిని పూజిస్తూ ఒక గుహలో ఇక్కడే మల్లికార్జునస్వామిలో ఐక్యం అయిందని పురాణం. శివుడి మహాభక్తురాలైన అక్క మహాదేవి కన్నడంలో దాదాపుగా 400 కి పైగా వచనాలు వ్రాసినట్లుగా గుర్తించారు. ఈమె తన అన్ని రచనలో కూడా చెన్న కేశవా అనే పదముతో ముగించినట్లుగా చెబుతారు. అక్కమహాదేవి విగ్రహము ఇప్పటికి మల్లికార్జుని గుడిలో ఉన్న మర్రిచెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది.

అయితే భూమికి 200 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు గల ఇక్కడి సహజ శిలాతోరణం అద్భుతమని చెప్పాలి. ఇక భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన గొప్ప రచయిత్రి. ఆ పరమ శివుడిని తన భర్తగా భావించిన గొప్ప భక్తురాలు.

Exit mobile version