Home Unknown facts శివుడు శివలింగ రూపంలో స్వయంభువుగా వెలసిన ఆలయం

శివుడు శివలింగ రూపంలో స్వయంభువుగా వెలసిన ఆలయం

0

మన దేశంలో అతి పురాతన, అద్భుత శివాలయాలు ఎన్నో ఉన్నాయి. శివుడు లింగరూపంలో దర్శనమివ్వగ ఆశ్చర్యాన్ని కలిగించే ఎంతో చరిత్ర కలిగిన శివలింగాలను మనం ఇప్పటికి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టిచడం వెనుక ఒక కథ ఉంది. మరి ఈ శివాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శివలింగాన్ని ఎలా ప్రతిష్టించారో తెలుసుకుందాం.

1-Lingam

నాగాలాండ్ రాష్ట్రం, దిమాపూర్ లోని సీంగ్రిజాన్ అనే గ్రామంలో శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని గ్రామస్థులు 1961 వ సంవత్సరంలో నిర్మించినట్లుగా తెలియుచున్నది. ఇక్కడి ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చే శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడిన, స్వయంభువు శివలింగం అని చెబుతారు.

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న రంగపవర్ అనే అరణ్యప్రాంతంలో కి స్థానికులు వేటకు వెళుతుండేవారు. అయితే ఒక రోజు భార్యాభర్తలు ఇద్దరు అటవీ ప్రాంతంలో వెళుతుండగా అతడి భార్యకి ఒక పదునైన రాయి చాలా వింతగా అనిపించగా, కత్తులు సానబెట్టుకోవడానికి ఆ రాయిని ఉపయోగించుకోవచ్చని భావించి తనతో పాటుగా ఆ రాయిని ఇంటికి తీసుకువెళ్ళింది. ఇలా ఇంటికి తీసుకువెళ్లిన తరువాత కత్తిని ఆ రాయి మీద సానబెడుతుండగా ఆ రాతి నుండి ఎర్రటి ద్రవం కారడంతో ఆశ్చర్యానికి గురై వారి ఇంటి చుట్టుపక్కల వారికీ జరిగిన విషయాన్నీ వివరించింది.

ఇక అదే రోజు రాత్రి కలలో శివుడు ప్రత్యక్షమై అది రాతి కాదు నా రూపమైన శివలింగం అని చెప్పి ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించమని చెప్పడటా. అయితే ఉదయం లేచిన తరువాత తనకి వచ్చిన కలని మర్చిపోగ, అదే కల వరుసగా మూడు రోజులు రావడంతో నాలుగవ రోజున తనకి కలలో శివుడి వచ్చిన విషయాన్నీ ఊరు ప్రజలందరికీ వివరించడంతో, ఇప్పటికే శివుడు కలలో మూడు సార్లు చెప్పాడు, ఆయనకి ఆగ్రహం రాకముందే, ఎవరికీ ఎలాంటి ఆపద కలగకుండా శివుడే మనల్ని చల్లగా చూసుకుంటాడని భావించి అదే రోజు గ్రామస్థులు అక్కడ శివాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు.

ఈవిధంగా శివుడు శివలింగ రూపంలో స్వయంభువుగా వెలసిన ఈ ఆలయంలో మహా శివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు.

Exit mobile version