Home Unknown facts అప్సరసలు సృష్టించడం వెనుక గల కారణం

అప్సరసలు సృష్టించడం వెనుక గల కారణం

0

ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అందం గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటారు, అయితే అమ్మాయి అందం గురించి చెప్పాలంటే దేవలోక సౌందర్య తారల గురించి చెబుతారు. స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడినవారు అప్సరసలు. అందంగా ఉన్నవారిని గురించి పొగడాలనుకుంటే ఎవరైనా అప్సరసలాగా ఉన్నావని అంటారు. పురాణాల ప్రకారం అస్సరసలు అనే వారు దేవలోకంలో ఉండేవారని తెలుస్తోంది.

Apsarasసౌందర్యంతో తాపసులను కూడా వెంటతిప్పుకున్న అప్సరసలను గురించిన కథలు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తాయి. మహర్షులు తపస్సులను తలపెట్టడం ఆ తపస్సులను భగ్నం చేయడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపించడం గురించిన కథలను విన్నాము. అలా మహర్షుల మనసులను మళ్లించడంలో కొంతమంది అప్సరసలు విజయాన్ని సాధిస్తే, మరికొంతమంది మహర్షుల ఆగ్రహావేశాలకి గురై శాపాలను భరించారు.

ఎన్ని యుగాలు తరాలు మారినా వన్నె తగ్గని అందం ఆదేవలోక సౌందర్య తారల సొంతం అంటారు. అయితే వారిలో రంభ, ఊర్వశి, మేనకల పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ నిజానికి అస్సలు అప్సరసలు ఎంతోమందో అందరికి తెలియదు. బ్రహ్మ పురాణం ప్రకారం అప్సరసల సంఖ్య 31. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. వారి పేర్లు ఇపుడు తెలుసుకుందాం.

31 అప్సరసలు:

  • రంభ
  • మేనక
  • ఊర్వశి
  • తిలోత్తమ
  • ఘృతాచి
  • సహజన్య
  • నిమ్లోచ
  • వామన
  • మండోదరి
  • సుభోగ
  • విశ్వాచి
  • విపులానన
  • భద్రాంగి
  • చిత్రసేన
  • ప్రమోచన
  • ప్రమ్లోద
  • మనోహరి /మనో మోహిని
  • రామ
  • చిత్రమధ్య
  • శుభానన
  • సుకేశి
  • నీలకుంతల
  • మన్మదోద్ధపిని
  • అలంబుష
  • మిశ్రకేశి
  • పుంజికస్థల
  • క్రతుస్థల
  • వలాంగి
  • పరావతి
  • మహారూప
  • శశిరేఖ

 

Exit mobile version