Home Unknown facts శ్రీ వేంకటేశ్వరస్వామి అప్పు తీర్చలేక వెలసిన అద్భుత ఆలయం ఎక్కడ ?

శ్రీ వేంకటేశ్వరస్వామి అప్పు తీర్చలేక వెలసిన అద్భుత ఆలయం ఎక్కడ ?

0

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీవేంకటేశ్వరస్వామి కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఇక్కడ కొండపైన కొన్ని రోజులు ఉన్నాడని స్థల పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Venkateswaraతెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిలుపూరు గ్రామంలోని గుట్టపైన శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అతి ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఇక్కడ వెలసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఎందుకంటే ఈ ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చే శ్రీవేంకటేశ్వరస్వామిని బుగుల్ లేదా గుబులు వేంకటేశ్వరస్వామి అని పిలుస్తారు. ఈవిధంగా వేంకటేశ్వరస్వామిని పిలవడం వెనుక ఒక పురాణం ఉంది.

ఈ ఆలయ పురాణానికి వస్తే, శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారితో వివాహం జరుగగా అప్పుడు స్వామివారు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆవిధంగా తీసుకున్న అప్పు తీర్చలేక వడ్డీ కడుతూ స్వామివారు వడ్డికాసులవాడు అయ్యాడని చెబుతారు. అయితే తీసుకున్న అప్పు తీర్చలేక స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి గుట్టపైన టాప్స్ చేసాడని స్థలపురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ వెలసిన స్వామివారిని బుగుల్ లేదా గుబులు అని పిలుస్తారు. దీనికి చింత, దిగులు అని అర్ధం. అయితే వేంకటేశ్వరస్వామి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొండక్రింది భాగంలో పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఇలా స్వామివారి పాదాల గుర్తులు ఉన్న ఈ ప్రదేశాన్ని పాదాల గుండు అని పిలుస్తుంటారు.

ఈ విధంగా పురాతన కాలం నుండి పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇంకా శ్రీ వెంకటేశ్వరస్వామివారే అప్పుల బాధ నుండి బయటపడటానికి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు కనుక ఇక్కడ వెలసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు ఉండవని భక్తుల నమ్మకం.

Exit mobile version