Home Unknown facts ఏ పాపాలు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాలో తెలుసా ?

ఏ పాపాలు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాలో తెలుసా ?

0

గరుడ పురాణం అనగానే అదేదో భయంకరమైనది అని భావిస్తారు. కానీ నిజానికి మనుషులు ఎలాంటి పాపాలు చేయకూడదని దాని ఉద్దేశం. ఒకవేళ పాపాలు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాలో తెలుసుకుందాం.

Garuda Puranamతప్తవాలుకం:

మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాలిన శరీరాలతో దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీన్నే ”తప్త వాలుక నరకం” అంటారు. అతిథులను పూజించనివారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవులను, వేదవిదులను, యజమానిని, కాళ్ళతో తన్నినవారి పాదాలను యమదూతలు ఎలా కాలుస్తున్నారో అనేది ఇందులో ఉంటుంది.

అంధతామిత్రం:

నరకంలో సూది మొనల్లాంటి భయకర ముఖాలు కలిగిన పురుగులు, పాపాత్ముల శరీరాలను తొలచివేస్తుంటాయి. ఇది పదహారు రకాలుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని బయటపెట్టే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు.

క్రకచం:

ఇది మూడో నరకం. ఇక్కడ పాపాత్ములను నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా, సమూలంగా, అంగాంగాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు.

అసిపత్రవనం:

నరకాలలో నాలుగోది అసిపత్రవనం. భార్యాభర్తలను విడగొట్టే లేదా తల్లిదండ్రుల నుండి వారి సంతానాన్ని దూరం చేసే వారు ఈ నరకం చేరి నిలువెల్లా బాణాలతో, అసిపత్రాలతో హింసించబడతారు. రక్తం కారుతుండగా, వెంబడిస్తున్న తోడేళ్ళకు భయపడి శోకాలు తీస్తూ, పరుగులు తీస్తూ ఉంటారు. విపరీతమైన హింస తో కూడిన ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.

కూటశాల్మలి:

పర స్త్రీలను, పరుల సొమ్ముని దొంగతనం చేసిన వాళ్ళు, ఇతరత్రా అపకారాలు చేసిన వాళ్ళు ”కూటశాల్మలి” నరకం చేరతారు. ఇక్కడ 16 రకాలుగా దండిస్తారు.

రక్తపూయం:

ఇది ఆరవ నరకం. ఇక్కడ దుర్మార్గులు తలకిందులుగా వేళ్ళాడుతూ యమకింకరులచేత హింసించబడుతుంటారు. తినకూడనివి తిన్నవారు, ఇతరులను నిందించినవారు, చాడీలు చెప్పినవారు ఈ నరకం చేరతారు.

కుంభీపాకం:

మొట్టమొదట విధించబడేది, ఘోరాతిఘోరమైనది, నరకాలన్నిటిలోకీ ఘోరమైనది కుంభీపాక నరకం. అగ్నికీలలు, దుర్గంధాలతో కూడి ఉంటుంది.

రౌరవం:

నరకంలో ఎనిమిదవది అయిన ఈ రౌరవం దీర్ఘకాలికం. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు.

 

Exit mobile version