Home Unknown facts సంతానం కోసం చేయాల్సిన హనుమాన్ పూజ ఎలా చేయాలి?

సంతానం కోసం చేయాల్సిన హనుమాన్ పూజ ఎలా చేయాలి?

0

హనుమంతుడు.. ధైర్యం, శక్తి సామర్ధ్యాలకు ప్రతీక. ఆంజనేయుడు లేని రామాయాణాన్ని ఊహించలేం. హనుమంతుని గొప్పతనం గురించి వాల్మీకి మహర్షి అద్భుతంగా వివరించారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీరాంజనేయుని శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. శ్రీరామ దాసుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. 100 యోజనాల విస్తారమైన సముద్రాన్ని ఏకధాటిగా దాటినవాడు. లంకలో రావణ చెరయందు బందీయైన సీతమ్మ శోకాన్ని మాపినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణనుని గర్వం అణచినవాడు. హనుమంతుని నామాలు ప్రయాణానికి ముందు, నిద్రపోయే ముందు స్మరిస్తే వారికీ మృత్యుభయం, భూత భయం ఉండదు. అంతే కాకా వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

Hanumanఇంతటి అతిబల పరాక్రమవంతుడైనప్పటికీ హనుమంతుడు ఎల్లపుడు శ్రీరాముని సేవలోనే గడిపేవాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు ఆంజనేయుడు.. తన గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిక్కిలిగా హనుమంతుడు శ్రీ రాముని ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ నుదుటున సిందూరం చూసిన మారుతి ఎందుకు పెట్టుకున్నావు తల్లీ అని అడుగుతాడు.. అప్పుడు సీతమ్మ తల్లి శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఇలా సింధూరం ధరిస్తున్న అని చెబుతుంది. అంతే అది విన్న హనుమంతుడు ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం ధరిస్తాడు… హనుమంతునికి శ్రీరాముని పై గల ప్రేమ అంతడిది.. రాములవారిపై ఆంజనేయుని భక్తి నిరుపమానమైనది.

కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు హనుమంతుడు, వినాయకుడు అని అర్థంతో ‘కలౌ కపి వినాయకౌ’ అని చెప్పబడింది.. ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్’ అని శ్రీరాముని కీర్తన జరిగే చోట తప్పక హనుమంతుడు ఉంటాడని చెప్పబడింది..

ఇక మానవుల్ని భయాందోళనలకు గురిచేసే భూతప్రేత పిశాచాలు హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహా రోగాలు సైతం మటుమాయం అవుతాయి. అంతే కాదు శని ప్రభావం వల్ల కలిగే బాధలూ ఆన్జనేయుని పూజిస్తే తొలగిపోతాయి. అలాగే మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. ఇక హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే ఆంజనేయునికి ఐదు ప్రదక్షిణలు చేయాలి. అరటి, మామిడి పళ్లు అంటే మారుతికి మక్కువ…

సంతానం లేని వారు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి అరటిపండు నైవేద్యంగా నివేదించి, పూజ అనంతరం ఆ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే వారికీ సంతానం భాగ్యం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు. హనుమాన్ చాలీసాను పారాయణ చేయదలిస్తే.. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు అంటే మండలం కాలం పాటు రోజుకు ఒకటి, మూడు, ఐదు, పదకొండు, బేసి మొత్తంలో, లేదా 41 సార్లు పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.. .ఇలా చేయటం వలన చేపట్టిన కార్యాలు, అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు..

Exit mobile version