Home Unknown facts అమ్మవారికి జ్ఞాన ప్రసూనాంబ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

అమ్మవారికి జ్ఞాన ప్రసూనాంబ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

0

పూర్వం పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రాలను భోదించి నిశ్చలమైన మనసుతో జపం చేయమని చెప్పాడు. జపము చేసే సమయంలో ఆమెకు ఆటంకాలు కలిగి మందబుద్ధి ఆవరించి నియమం విస్మరించింది. అపుడు శివుడికి కోపం వచ్చి ఆమెను భూమిఫై మానవస్త్రీగా అవుతావని శపిస్తాడు.

జ్ఞాన ప్రసూనాంబఅపుడామే శాపవిమోచనకై శివుని ప్రాద్దించగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పుజించమని బదులిస్తాడు. పార్వతి దేవి నారదుని సాయంతో భూమికివచ్చి ఘోర తపం ఆచరిస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆమెను తన అర్ధాంగమున అర్ధనారిశ్వరత్వమున సగభాగం చేసుకుంటాడు. ఆమెకు పూర్తి జ్ఞానమును ప్రసాదిస్తాడు.

అప్పటి నుండి ఆమె జ్ఞానప్రసూనాంభిక అను పేరుతో శ్రీ కాళహస్తిశ్వరస్వామి వారి సన్నిధ్యమున వెలిసింది.

ప్రణవ పంచాక్షరి జపసిద్ధిని పొంది జ్ఞానప్రదిప్తిని భక్తులకు ప్రసాదించటం వల్ల ఆమెకు జ్ఞాన ప్రసూనంబా అనే పేరు సార్దకమైంది.

 

Exit mobile version