Home Unknown facts వ్యక్తిని బట్టి నమస్కారం ఉంటుందా ? ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి

వ్యక్తిని బట్టి నమస్కారం ఉంటుందా ? ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి

0

నమస్కారం మన సాంప్రదాయం. ఈ రోజుల్లో విదేశీ సంస్కృతికి అలవాటు పడి షేక్ హ్యాండ్ లు ఇంకా వివిధ రకాలుగా పలకరించుకోవడం జరుగుతుంది. కానీ ప్రపంచం నలుమూలల ఉన్నవారు మన హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తారు కారణం మన పద్ధతులు కట్టుబాట్లు. కరోనా వల్ల మరొక సారి మన నమస్కారం విలువ పెరిగింది. అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే ఒక్కో వ్యక్తిని బట్టి నమస్కారం ఉంటుంది. ఏమిటి? మనిషిని బట్టి నమస్కారం ఉంటుందా ? అని ఆశ్చర్య పడకండి. ఇక్కడ వ్యక్తి అంటే ఆ వ్యక్తితో లేదా మనకు ఉండే బంధం అని అర్ధం.. నమస్కారం లో కూడా రకాలుంటాయి.

Namaskarరెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర. ఇది అందరికి తెలిసిన విషయమే.

మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. రెండు చేతులను హృదయం దగ్గర జోడించి నమస్కరించాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.

గురుదేవులకు నెన్నుదురు(నుదుటి దగ్గర) దగ్గర నమస్కరించాలి. గురువు స్థానంలో ఉన్నవారిని రెండు చేతులు నుదుటి భాగంలో కలిపి నమస్కారం చేయాలి. దీనిని ధ్యానం అంటారు.

ఇక చివరిది బంధం తో కాకుండా భక్తితో నమస్కారం. దేవతలకు తలపై(నుదుటి పైన మణికట్టు అంటేలా) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.
ఇది భారతీయ ఆచార విధి.

 

Exit mobile version