Home Unknown facts దేవుడి అవతారాలలో ఒక అవతారంగా భావించే నారాయణస్వామి ఆలయం

దేవుడి అవతారాలలో ఒక అవతారంగా భావించే నారాయణస్వామి ఆలయం

0

దేవుడి అవతారాలలో ఇక్కడ వెలసిన నారాయణస్వామి అవతారం ఒకటి అని భక్తులు భావిస్తారు. అయితే పురాతన కాలంలో సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన ఈ స్వామి సమాధి పైనే ఒక అందమైన ఆలయాన్ని నిర్మించారు. మరి ఆ స్వామి ఎవరు? అతడిని దేవుడి అవతారం అని ఎందుకు ఎంటరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Narayanaswamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలం లో కోవిలం పాడు మిట్టపాలెం గ్రామంలో మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం ఉంది. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సర్వసంగ పరిత్యాగిగా, యోగిగా, కోరిన వరాలను ఇచ్చే ఇలవేల్పుగా భక్తులు మిట్టపాలెం శ్రీ నారాయణస్వామిని కొలుస్తుంటారు. భగవంతుడి అవతారాలలో ఈ స్వామిది ఒక అవతారంగా భక్తులు భావిస్తారు.

ఇక పురాణానికి వస్తే, మిట్టపాలెం గ్రామస్థులు కొమ్మినేని మహాలక్ష్మమ్మ, వెంకటరామయ్యల మూడో సంతానం నారాయణస్వామి. తల్లితండ్రులు ఈయనకు కొండయ్య అనే నామకరణం చేసారు. ఈయన చిన్నతనం నుండే భక్తిభావలతో, పరధ్యానంగా ఉండే అతడిని అందరు పిచ్చి కొండయ్య అనే పిలిచేవారు. అయన చిన్నతనంలోనే సన్యాసులతో కలసి గ్రామం విడిచి వెళ్ళిపోయాడు.

ఈ తరువాత కొన్ని సంవత్సరాలకు ఈ ప్రాంతం తిరిగి వచ్చి కొండ గుహల్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. అయితే రైతులను ఆదుకొని రాజులకి పన్ను వసూలు చేసే హక్కులేదని కప్పం చెల్లించవద్దని అయన ప్రచారం చేసాడు. ఈ విషయం తెలిసిన రాజు ఆయనను నిర్బంధించాడు. అప్పుడు ఆ స్వామి తప్పించుకొని రాజు దగ్గరికి వెళ్లి రైతు బాధలను వివరించాడు. మానవాతీత శక్తులు ఉన్నందు వల్లే నారాయణస్వామి నిర్బంధం నుండి తప్పించుకొని బయటికి వచ్చాడని భావించిన రాజు ఆయనను గౌరవించి వదిలివేసాడు.

ఇక ఆ తరువాత నారాయణస్వామి మానవసేవకు జీవితాన్ని అంకితం చేసి ఎన్నో విధాలుగా ప్రజలకు సేవ చేసాడు. ఒక రోజు ఆదివారం నాడు అమావాస్య రోజున ఆ స్వామి జీవసమాధి అయ్యాడు. తరువాత అయన సమాధిపైనే ఒక అందమైన ఆలయం నిర్మించారు.

ఇలా వెలసిన ఈ మిట్టపాలెం నారాయణస్వామిని దర్శించుటకు ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు ఇక్కడికి అన్ని మతాలకు అతీతంగా ఈ ఆలయాన్ని దర్శించి తరిస్తారు.

Exit mobile version