Home Unknown facts నవగ్రహాలు దర్శనం తరువాత చెయ్యవలసిన పనులు ఏంటో తెలుసా ?

నవగ్రహాలు దర్శనం తరువాత చెయ్యవలసిన పనులు ఏంటో తెలుసా ?

0

జ్యోతిష్య సాంప్రదాయంలోను , తత్ఫలితంగా హిందువుల రోజు వారి జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.

Navagrahaఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. నవగ్రహాలను దర్శించిన తరువాత కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ అక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అని అంటున్నారు.

నిజానికి ఆలయంలోకి వెళ్ళే ముందే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకోవాలి. లేదా ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ తరువాత నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు.

ఇంటి నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్ళడం ఇబ్బందికరం కాబట్టి ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించక ముందే కాళ్ళు కడుక్కొని నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవదర్శనం చేసి ఇంటికి రావాలి. అంతేకానీ దేవతారాధన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకూడదు.

కాలకృత్యాలు వంటి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కాబట్టి నవగ్రహ దర్శనం చేసిన తరువాత కాళ్ళు కడుక్కోవాలి అనడం అసత్యం. అది మంచి పద్ధతి కాదు.

నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది. అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా! ప్రయోజనం ఉండదు కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు. ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి అంతే. ఆలయంనుంచి నేరుగా ఇంటికే రావాలి. ఎవరింటికీ వెళ్ళకూడదు.

Exit mobile version