Home Unknown facts ఇంట్లో పూజ గదిని ఎక్కడ, ఎలా ఏర్పాటు చేయాలి? వాస్తు ప్రకారమే ఎందుకు...

ఇంట్లో పూజ గదిని ఎక్కడ, ఎలా ఏర్పాటు చేయాలి? వాస్తు ప్రకారమే ఎందుకు చేయాలి?

0

పూర్వం ప్రతి గృహంలో ప్రత్యేకంగా ఒక గదిని పూజకి ఏర్పాటు చేసుకునే వారు.. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం అన్నది సమస్యే. అయితే దైవభక్తి అధికంగా ఉన్నవారు ఒక గదిని ప్రత్యేకంగా దేవుడికి కేటాయించాలనే అనుకుంటారు. మరి ఇంట్లో పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? వాస్తు ప్రకారం ఎందుకు అనే విషయాలు మనం ఇపుడు తెల్సుకుందాం…

Pooja Gadhiపూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్య, తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పా టు చేయాలి. దీనికి కారణం తెల్లవారు జాము నే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటా డు. ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి.అంతేకాదు, సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మంచిది అని చెప్తారు… ఎక్కువ స్థలం ఉన్నవారైతే ఇంటి మధ్యలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి మధ్య భాగాన్ని గాలి, వెలుతురు సవ్యంగా పారేందుకు ఖాళీగా ఉంచాలి. ఆ మధ్య ప్రదేశంలో పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు.

అలాగే పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేయాలి తప్ప బేస్‌మెంట్‌లో చేయకూడదు. దీనికి కారణం బేస్‌మెంట్‌లోకి వెలుతురు ప్రసరించదు. అలాగే పూజ గదిని పై అంతస్థులలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్ద వారు, కదలలేని వారు ఉంటే ఇది సమస్య అవుతుంది.

ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి. అయితే పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. దీనికి కారణం దేవుడి వైపు కాళ్ళు పెట్టి పడుకోవడానికో లేక దేవుడు ఉన్నాడనే భావనతోనో నిద్రించలేరు. అలాగే పూజగది బాత్‌రూంకు సమీపంలో లే కుండా చూసుకోవాలి. అక్కడి నుంచి వచ్చే శబ్దాలు, వాసనలు పూజ చేసే వ్యక్తులకు ఇబ్బందిని కలిగిస్తాయి.. ‌.

ఒకవేళ ప్రత్యేకంగా పూజగదినే ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలను ఎటు పెట్టుకోవాలన్నది చాలా మంది సందేహం. ఈ విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఉదయం సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి ప్రసరిస్తాయి, సాయం వేళల్లో పడమర నుంచి ప్రసరిస్తాయి. కనుక ఇవి వి గ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించే వారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కున, తల ఉత్తరం దిక్కున ఉంటాయి. దీని వల్ల శరీరలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే అయస్కాంత ఉత్తర శక్తిని వికర్షిస్తుంది… అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడదు. ఇందుకు కారణం దానిని చూస్తూ దేవుడి మీద మనసును లగ్నం చేయలేం. అలాగే వి గ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి తప్ప అవి ఒకదానిని ఒకటి చూసుకోరాదు.

గోడకు ఒక అంగుళం దూరంలో విగ్రహా లు పెట్టాలి. దీని వెనుక ఉన్న కారణం గాలి, అగరొత్తుల పొగ వంటివన్నీ చుట్టుకోకుండా సులభంగా పారడానికే. దేవుడి ముందు దీపా లు వెలిగించేటప్పుడు దానిని విగ్రహం ముం దే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనుపిస్తాయి.పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటి అంటే అవి విగ్రహాలకు, మనం కూచోవడానికి అడ్డం లేకుండా ఉంటాయి. పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగతధ్యానానికి, పూజకు ఉద్దేశించిం ది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉంటుంది.పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెట్టడం సరికాదు. చాలా మంది పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడుతున్నామనుకుంటారు కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు బాధాకరమైన జ్ఞాపకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు.

పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. కారణం దాని వల్ల గది మరింత కుదురుగా కనుపిస్తుంది.పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి.

అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులవవుతుంది.

 

Exit mobile version