Home Unknown facts 300 అతిపురాతన హిందూ దేవాలయాలు ఉన్న కుంబల్‌ఘర్ కోట !

300 అతిపురాతన హిందూ దేవాలయాలు ఉన్న కుంబల్‌ఘర్ కోట !

0

ప్రపంచంలో అతిపెద్ద గోడ చైనా లో ఉంది. దీనినే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అంటారు. దీని మొత్తం పొడవు 6,508 కి.మీ. చైనా వాల్ తరువాత ప్రపంచంలో రెండవ అతి పెద్ద గోడ మన దేశంలో రాజస్థాన్ లో ఉంది, అదే కుంబల్‌ఘర్ కోట. మరి ఈ కోట విశేషాలు ఏంటి? దీనిని ఎవరు నిర్మించారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kumbagal Kotaరాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సమంద్ జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణుల్లో కుంబల్‌ఘర్ కోట ఉంది. ఈ కోట సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోటను 15 వ శతాబ్దంలో మేవార్ రాజు రాణా కుంభ ఆరావళి పర్వతాలపైనా నిర్మించాడు. అందుకే ఈ కోటకు ఆయన పేరుమీదనే కుంబల్‌ఘర్ కోట అని వచ్చినది. ఈ కోట మొత్తం పొడవు 36 కిలోమీటర్లు ఉంటుంది. అయితే రాణా కుంభ ఈ కోటను నిర్మించడానికి అనేక సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఈ కోట యొక్క ప్రధాన ద్వారం చేరుకోవడానికి ఒక కిలోమీటర్ పొడవు ఉన్న మెట్లమార్గాన్ని అనుసరించాలి. శత్రువులకు అర్థంకాకుండా ఉండటం కోసం ఇక్కడి మెట్ల మార్గం అంతకుడా చాలా చీకటిగా ఉంటుంది.

రాజస్థాన్ శిల్పకళా నైపుణ్యంజ్ ఉట్టిపడేలా ఈ కోట నిర్మాణం ఉంటుంది. ఈ కోటాలో దాధాపుగా 300 అతిపురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ కోటను సందర్శించడానికి పర్యటకులు ఎక్కువగా నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వస్తుంటారు. ఇక ఆరవల్లీ పర్వతంలో కఠినమైన పర్వతశ్రేణుల్లో పాలి, రాజసమండ్ జిల్లాలలో వన్యమృగ శరణాలయం ఉంది. దీనిని కుంబల్‌ఘర్ కోట నిర్మించిన తరువాత కుంబల్‌ఘర్ వన్యప్రాణి శాంక్‌చ్యురీ అనే పేరుని పెట్టారు. అయితే 576 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ శరణాలయం సముద్రమట్టానికి దాదాపుగా 500-1,300 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ఇక ఆరావళి పర్వతాల మధ్య దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Exit mobile version