పూర్వకాలం నుండి కూడా మన పెద్దలు మనకి చాలా నియమాలు నిష్టలు, ఆచారాలు అలాగే కొన్ని సంప్రదాయాలను అలవరిచారు .. వీటికోసం ఎన్నో పురాణాలూ, స్మృతులు సైతం తయారుచేసి భావితరాలకు అందచేశారు.. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి పాటించే వారు తక్కువే అయినప్పటికీ.. మన పెద్దలు పెట్టిన కొన్ని నియమాలను తెలుసుకోవటం మనకు మంచిదే.. ఎందుకంటే పెద్దలు చెప్పే ఎలాంటి ఆచారాలు నియమ నిష్ఠల వెనుకైనా ఉండే కారణం ఒక్కటే.. మనం బావుండాలి అని.. అలంటి కొన్ని నియమాల్లో శయన నియమాలు కూడా ఉన్నాయి… మరి మనం నిద్రకు ఉపక్రమించేటపుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. ఏ పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు తెల్సుకుందాం..
తడి పాదములతో నిద్రించకూడదని, పొడి పాదాలతో నిద్రించాలని అత్రి స్మృతిలో చెప్పబడింది.
ఇక విరిగిన పడకలు అంటే విరిగిన మంచాలపై గాని.. అలాగే ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం అని మహాభారతం తెల్పుతుంది. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదని గౌతముని ధర్మ సూత్రంలో చెప్పబడింది.
ఎపుడు కూడా పగటిపూట నిద్రించరాదు.. పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు అని బ్రహ్మా వైవర్తపురాణంలో పేర్కొనబడింది. అలాగే సూర్యాస్తమయానికి ఒక ప్రహారం అంటే సుమారు మూడు గంటల తరువాతనే పడుకోవాలిట.
గుండెపై చేయి వేసుకుని కానీ, కాలుపై కాలు వేసుకుని కానీ నిద్రించ రాదు. అలాగే పడక మీద త్రాగడం- తినడం లాంటివి చేయకూడదు. పడుకొని పుస్తక పఠనం చేయకూడదట… ఎందుకంటే పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుందట.