Home Unknown facts స్వామివారికి రక్షణగా 19 అడుగుల పాము కాపలాగా ఉండే ఆలయం

స్వామివారికి రక్షణగా 19 అడుగుల పాము కాపలాగా ఉండే ఆలయం

0

మన దేశంలో పాముని దైవంగా భావిస్తూ నాగదేవతగా కొలుస్తూ పూజిస్తాం. అందుకు నిదర్శనంగా నాగులపంచమి అనే పండుగను మనం జరుపుకుంటాం. ఇది ఇలా ఉంటె ఈ ఆలయంలో పూర్వం నుండి ఆలయ గర్భగుడిలో స్వామివారికి రక్షణగా ఏకంగా 19 అడుగుల పాము కాపలాగా ఉంటుంది. మరి ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయానికి పాముకి సంబంధం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Snake Templeఈ ఆలయం మలేసియా దేశంలో ఉంది. దీనినే స్నేక్ టెంపుల్ అని అజూర్ క్లౌడ్ టెంపుల్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఆలయంలోని గర్భగుడిలో స్వామివారు పక్కన పాము కూడా పూజలను అందుకుంటుంది. ఈ పాము ఎప్పటినుండి ఇక్కడ ఉంటుంది అనే విషయం ఇప్పటికి ఎవరికీ స్పష్టంగా తెలీదు. ఈ గుడి మలేషియా లో ఉన్నప్పటికీ చేసే పూజలు మాత్రం మన స్వచ్చమైన తమిళ సాంప్రదాయంలో, దేవుడికి ఎలా అయితే ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారో, ఇక్కడ ఆ పాముకు కూడా దేవుడి విగ్రహాల పక్కనే పెట్టి పూజిస్తారు. ఈ పాముని సాక్షాత్తు శివుడే పంపించాడని ఆలయంలో ఎద విధిగానే పూజలను నిర్వహిస్తుంటారు.

ఇక ఆలయ విషయానికి వస్తే, చోర్ సూ కుంగ్ జ్ఙానపకార్థంగా ఈ ఆలయాన్ని 1850 లో బౌద్ధ సన్యాసులు నిర్మించారు. అయితే ఈ సన్యాసి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు పాములకు ఆశ్రయం ఇచ్చేవాడు. దైవభక్తి ఉన్న కారణంగా ఈ సన్యాసి ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించి ఆలయం పనులు మొదలు పెట్టాడు ఇక ఆలయం పూర్తయ్యేనాటికి అయన మరణించాడని చెబుతుంటారు.

ఆ తరువాత, ఇక్కడ నివసించే పాములు పూజారి శిష్యులకు నమ్మేవాని అందువల్ల ఇది అనేక నివాసితులలోని ప్రమాదకరమైన వాగ్లెర్ పిట్ విపర్స్ మరియు ఆకుపచ్చ చెట్టు పాముల నివాసంగా మారిందని చెబుతుంటారు. సింగపూర్ మరియు తైవాన్ లోని కొందరు భక్తులు చోర్ సో కోంగ్ యొక్క పుట్టినరోజున ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తారు.

 

Exit mobile version