Home Unknown facts తిరుమల తిరుపతిలో సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తెరిచేది ఏంటి?

తిరుమల తిరుపతిలో సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తెరిచేది ఏంటి?

0

తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. మరి తిరుమల తిరుపతిలో సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తెరిచేది ఏంటి? దానివెనుక కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Thumbara Theertham At Tirumala

తిరుమల తిరుపతిలో గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం తుంబుర తీర్థం. ఇది శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ వేంకటాచల మహాత్మ్యం లో తుంబుర తీర్థం ప్రస్తావన అనేది ఉంది. పురాణం ప్రకారం, నారదుడు, తుంబురుడు తుంబుర తీర్థం సమీపంలో సంగీతంలో పోటీ పడ్డారని చెబుతారు. అయితే సంగీత పోటీలో తుంబరుడి పైన నారదుడు గెలవడంతో అలిగిన తుంబరుడు ఇక్కడ ఉన్న తీర్థంలో అలానే కూర్చొని ఉండగా శ్రీనివాసుడు వచ్చి అతడిని బుజ్జగించాడని అందుకే ఈ తీర్దానికి తుంబర తీర్థం అనే పేరు వచ్చినది చెబుతారు.

ఇక తుంబరుడు ఎవరు అనే విషయానికి వస్తే, తుంబరుడు గంధర్వ వంశమున జన్మించాడు. అయితే కుబేరుడికి తన విననాధాన్ని అందించలేకపోయిన తుంబరుడిని రాక్షసుడివై జన్మించు అని శపిస్తాడు. ఆ తరువాత తుంబురుడు రాక్షసునిగా విరాధునికి పుట్టాడు. తుంబురుని వీణపేరు కళావతిగా చెపుతారు. మరొక కథనం ప్రకారం దుర్వాస మహామునికి ఆగ్రహాన్ని తెప్పించడంతో ఈ శాప ఫలితంగానే తుంబురుడు చిరుతొండడుగా వైశ్యకుటుంబాన కాంచీనగరంలో పుట్టాడట అని చెబుతారు.

తిరుమల తిరుపతిలో ఉండే తుంబర తీర్దానికి వెళ్లడం చాలా కష్టతరం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు తుంబుర తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. అయితే తుంబర తిర్దాన్ని గోన తీర్థమని కూడా అంటారు. ఇందులో స్నానం చేస్తే పాపా విముక్తిని పొందుతారని నమ్మకం.

Exit mobile version