Home Unknown facts విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా ?

విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా ?

0

బేతాళుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉండే పట్టువదలని విక్రమార్కుడు కథ మనందరికీ తెల్సిందే.. ఐతే ఆ విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా.. అసలు విక్రమార్కుడి ఆ సింహాసనం ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంటి మనం ఇపుడు తెలుసుకుందాం..

Vikramarka bethalaపూర్వం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది.. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు ఇద్దరు విద్యనభ్యసించినడి ఇక్కడే… ఈ మహాపట్టణంలోని మేడలు మేరుపర్వతాన్ని మించి ఎత్తు ఉంటాయట. ఆ మేడల్లో నివసించే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. విక్రమార్కునికి మంత్రి భట్టి.

అయితే భర్తృహరి కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళి పోతాడు. అనంతరం విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలుస్తుంది… ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞా పిస్తాడు… ఐతే రంభా ఊర్వశుల ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలుగుతుంది.. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయిస్టార్… అయినప్పటికీ ఆరోజు నాట్య ప్రదర్శనలో ఎవరి నృత్యం మేలుగా ఉందని నిర్ణయించలేకపోతారు. అప్పుడు ఇంద్రుడు, ఇంతటి మహామణులున్న సభలో నిర్ణయించే గొప్ప వారేలేరా? అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు లేచి, ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాడిని పిలిపించండి అని చెప్తాడు..

అపుడు ఇంద్రుడు వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయనీనగరాన్ని చేరుకుని రాజా నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది” అని విన్నవిస్తాడు. అందుకు విక్రమార్కుడు అంగీకరించి కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు.

విక్రమార్కుని ఆహ్వానించిన అమరేశ్వరుడు ఇంద్రుడు తన పక్కనే ఉన్న మణిమయరత్నఖచితమైన సింహాసనమ్మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నల అనంతరం తన సమస్యను వివరిస్తాడు… విక్రమార్కా, ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్పనాట్యగత్తెలు. వీరిరివురి నాట్యంలో ఎవరు మిక్కిలి అని తెలుసుకోవటం మాతరంకాలేదు. నీవు సకలవిద్యా పారంగతుడవు కాబట్టి వీరిద్దరిలో ఎవరు మిక్కిలి నాట్య ప్రావీణ్యులో నిర్ణయించి తెలుపుమని కోరతాడు.. రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించటానికి గాను రాగతాళయుక్తముగా గంధర్వ గానంతో శరీరము మెరుపుతీగవలె శృంగారము వర్షించునట్లు గా నాట్యం చేసింది. తదుపరి ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యము చేసింది. ఇద్దరినీ పరిశీలించినమీదట విక్రమార్కుడు ఊర్వశిని నేర్పరిగా నిర్ణయిస్తాడు.. అపుడు అలా ఎలా నిర్దారించారని ప్రశ్నిస్తాడు ఇంద్రుడు. కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశినాట్యం అత్యంత మనోహరమే గాకుండా శాస్త్ర పరిధులని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించటం జరింది అని చెప్పాడు విక్రమార్కుడు.

దానితో అతని మేధాశక్తికి సంతోషించిన ఇంద్రుడు దివ్యాభరణాలతోపాటు నవరత్నఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. అలా సాక్షాత్తు దేవేంద్రుని దగ్గరనుండీ విక్రమార్కుడికి సింహాసనం లభించింది.

Exit mobile version