Home Unknown facts ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని అతిపురాతన ఆలయాలు

ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని అతిపురాతన ఆలయాలు

0

భారతదేశంలో ఎన్నో అతి పురాతన అద్భుత ఆలయాలు అనేవి ఉన్నవి. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందూదేవాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపురాతన ఆలయాలు నేటికీ చెక్కు చెదరకుండా భక్తులకి దర్శనం ఇస్తున్నాయి. మరి ఆ అతిపురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నవి? ఆ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లింగరాజ ఆలయం ఒడిశా :

lingaraju alayam

ఒడిశా రాష్ట్రం, పూరీ జిల్లా నుండి 60 కిలోమీటర్ల దూరంలో లింగరాజ ఆలయం ఉంది. ఈ లింగరాజ ఆలయంలో స్వామివారిని త్రిభువనేశ్వరుడు అని భక్తులు కొలుస్తారు. ఈ ఆలయం సుమారు 40 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. గర్భగుడిలో ఎనిమిది అడుగుల వెడల్పు గల నల్లరాతి పానవట్టమూ నేలతో సమానమైన ఎత్తులోనే ఉండి, దాని మధ్యలో కేవలం తొమ్మిది అంగుళాల ఎత్తు ఉన్న శివలింగం ఉంది. ఈ ఆలయం కొన్ని వేలసంవత్సరాల క్రితం నాటిదిగా స్థలపురాణం చెబుతుంది. దేశంలో ఉన్న అతిపురాతన, అతిపెద్ద ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు.

కైలాసనాథ ఆలయం ఎల్లోరా :

మహారాష్ట్ర, ఔరంగాబాద్ కు సుమారు 26 కి.మీ. దూరంలో వెరూల్ అనే గ్రామంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇక్కడ పర్వత శిఖరంపైన మలచబడిన మొత్తం 34 గుహలు ఉన్నాయి. అందులో కైలాసనాథ ఆలయం అని పిలువబడే ఒక గుహ ఉంది. అయితే ఒక ఎత్తైన ఒక కొండని తొలచి ఈ ఆలయాన్ని చెక్కడంలో చూపించిన నేర్పరితనం బహుశా ప్రపంచంలో మరెక్కడా కూడా కనిపించదు. సుమారు 8 వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కైలాసనాథ ఆలయం, ఏకశిలా నిర్మాణ ఆలయం. అయితే క్రీ.. 768 ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఒకటవ కృష్ణరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. అయితే ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ ఆకారంలో వుంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు xఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది.

ముండేశ్వరి దేవి ఆలయం బీహార్ :

బీహార్ లోని, కైమూర్ జిల్లాలో ముండేశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం 608 అడుగుల ఎత్తుగల కొండపైన ఉండగా, ఈ ఆలయం సుమారు రెండువేల సంవత్సరాల నాటిదిగా స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి కొలువై ఉన్నారు.

తుంగనాథ్ ఆలయం ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్, రుద్రప్రయాగ జిల్లా లో చొప్త అనే ఒక అందమైన హిల్ స్టేషన్ ఉంది. అయితే చొప్త నుండి 4 కీ.మీ. దూరంలో తుంగ్నాద్ ఆలయం ఉంది. ఈ ప్రదేశం శివుడికి అంకితం చేయబడినదిగా చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. సముద్రమట్టానికి దాదాపుగా 3680 కిలోమీటర్ల దూరంలో తుంగ్నాద్ పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరం పైనే ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇదేనని చెబుతారు.

బ్రహ్మదేవుడి ఆలయం పుష్కర్ :

రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. సిందయరాజులకు మంత్రిగా ఉన్న గోకుల్ చెంద్ ఫరేఖ్ ఈ ఆలయాన్ని కట్టించారు. పురాణాల ప్రకారం సుమారు కొన్ని వేలసంవత్సరాల క్రితం శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేసాడట. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒంటెల జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ బ్రహదేవుడు నాలుగు ముఖాలతో దర్శనమిస్తుంటాడు. బ్రహదేవుడు ప్రధాన దైవంగా పూజించబడే ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు.

వరదరాజ పెరుమాళ్ ఆలయం కాంచీపురం :

తమిళనాడు రాష్ట్రంలోని, కాంచీపురం జిల్లా, విష్ణుకంచి ప్రాంత మందలి కరిగిరి అను ఎత్తైన గుట్ట మీద శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. సిద్ధాంతకర్త రామానుజులు ఈ ఆలయంలోని నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు, వెండి బల్లులు కలవు. ఈ దేవాలయం ప్రాంగణంలో ఆనంద సరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో నీటిలోపల అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవత మూర్తి విగ్రహం ఉంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే 2019 వ సంవత్సరంలో జూన్ నెలలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ ను భక్తులు దర్శనం చేసుకోవచ్చును.

చెన్నకేశవస్వామి ఆలయం కర్ణాటక :

కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిలాల్లో యాగచ్చి నది తీరాన బేలూరు అనే గ్రామం లో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఈ దేవాలయానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు శిల్పకళకు చెందిన ఉత్తమ కళాకండాలుగా చెప్పవచ్చు.ఈ ఆలయ శిల్పి జక్కనాచార్యుడు 12 వ శతాబ్దంలో కర్ణాటక లోని హొయసల రాజుల కాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపు రూపుదిద్దుకున్నవి.

ద్వారకాదీశ ఆలయం ద్వారక :

ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి పరిపాలించిన పవిత్ర పురం ఇది. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు.

బాదామి గుహలు కర్ణాటక :

కర్ణాటక రాష్ట్రము, బగల్ కోట్ జిల్లాలో బాదామి అనే ఊరు ఉంది. దీనినే కొంతమంది వాతాపి అని కూడా అంటారు. ఇది క్రీ.. 540 నుండి 757 ప్రాంతంలో పరిపాలించిన చాళుక్యుల రాజధాని నగరంగా అభివృద్ధి చెందినది. బాదామి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహాలకి, గుహాలయాలకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఎర్ర కొండలు ఎవరో మలిచినట్లుగా ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ మొత్తం నాలుగు గుహ లు ఉంటాయి. అందులో మొదటి గుహాలయం అన్నింటికంటే ప్రాచీనమైనది. ఇది అయిదవ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో శివుడిని అర్ధనారీశ్వర, హరి హర అవతారాలలో చెక్కారు.

Exit mobile version