Home Unknown facts భీముడిని ఒక పాము బంధించడానికి కారణం ఏంటో తెలుసా ?

భీముడిని ఒక పాము బంధించడానికి కారణం ఏంటో తెలుసా ?

0

కుంతీదేవికి వాయుదేవుని వరప్రసాదంగా భీముడు జన్మించాడు. పంచపాండవులలో రెండవ వాడు భీముడు. మహాభారతంలో శ్రీకృష్ణుడి తరువాత ముఖ్యుడు భీముడు. మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు బలశాలి మాత్రమే కాదు మంచి మనసు ఉన్న వాడు కూడా. అయితే ఒక సందర్భంలో మహాబలుడైన భీముడినే ఒక పాము బంధించినదట. మరి భీముడిని ఆ పాము ఎందుకు బంధించి? ఆ బందీ నుండి భీముడు ఎలా బయటపడ్డాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mighty Bheema

ఒక రోజు వేట కోసం భీముడు హిమాలయ శిఖరం వైపుకు వెళ్లగా అక్కడ ఒక కొండచిలువ ఆహారం కోసమై భీముడిని బంధించింది. ఇలా భీముడి శరీరాన్ని ఆ పాము చుట్టి వేయడంతో, ఇంతటి బలవంతునడైన నన్నే ఈ పాము బంధించింది అంటే ఇది సాధారణ కొండచిలువ కాదని భావించిన భీముడు, అసలు నీవు ఎవరు? ఎందుకని నన్ను ఇలా బంధించావని ప్రశ్నించగా, అప్పుడు ఆ కొండచిలువ, భీమా నేను నహుషుడు అనే మహారాజుని. ఒకసారి ఇంద్రుడు స్వర్గలోకాన్ని కాదని వెళ్లిపోగా, దేవతలందరు కూడా భూలోకానికి వచ్చి నాకు ఇంద్రాధిపత్యాన్ని అప్పగించారు. ఇలా నాకు ఇంద్ర పదవి రావడంతో నాలో ఉన్న గర్వం పెరిగి అందరిని కించపరచడం మొదలుపెట్టాను.

ఇలా బ్రహ్మ రథంపైన వెళుతుండగా, బ్రహ్మరథమనబడే ఆ పల్లకీ మోస్తున్న వారిలో అగస్త్యుడు కూడా ఒకరు. అగస్త్యుడు పొట్టివాడు. అందుచేత అతను పల్లకీ మోసేవైపు ఒరిగిపోతూ ఉంటుంది. ఇక నహుషుడు వేదాలను, మంత్రాలను దారంతా అవమానపరుస్తూ, సర్ప సర్ప అంటూ అగస్త్యుడ్ని కాలితో తంతాడు. సర్ప సర్ప అంటే తొందరగా నడవమని అర్థం. దాంతో కోపించిన అగస్త్యుడు సర్పోభవ అంటూ శపిస్తాడు. సర్పోభవ అంటే సర్పం అవుదువుగాక అని అర్థం. ఆవిధంగా నేను పాముగా మారిపోయానని భీముడితో చెబుతాడు.

ఇంతలో భీముడిని వెతుకుంటూ వచ్చిన ధర్మరాజు పాము బందీగా ఉన్న భీముడిని చూసి ఏమి ఈ వింత మహాబాలుడిని బంధించిన ఈ మాయ సర్పం ఎవరు అని అనుకుంటుండగా, సర్ప రూపంలో ఉన్న నహుషుడు జరిగినది వివరించి, సర్ప రూపంలో ఉన్న నేను అడిగిన ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెబుతారో వారి కారణంగా నాకు శాపం తొలగిపోతుందని చెబుతాడు. అందుకే నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇచ్చి ని తమ్ముడిని నా నుండి విడిపించుకోమని నహుషుడు అనగా, ధర్మరాజు సరే నా వంతుగా జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని ప్రశ్నలను అడగమంటాడు.

మొదటి ప్రశ్న: ఏ గుణాలు కలిగినవాడు బ్రాహ్మణుడు? అతడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అడుగగా, ధర్మరాజు, సత్యం, క్షమ, దయ, తపము, దానము, శీలము మొదలగు గుణములు కలిగినవాడు బ్రాహ్మణుడు. సుఖము, దుఃఖం ల యెడల సరైన బుద్ది కలిగి ఉండటమే అతను తెలుసుకోవాల్సిన ఉత్తమ విద్య అని జవాబు ఇస్తాడు.

రెండవ ప్రశ్న: ఇతరులకు అపకారం చేసి, అసత్యాలు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించి ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంతటి పవిత్రతను పొందినది ఎందుకు అని ప్రశ్నించగా? అప్పుడు ధర్మరాజు, సత్య పలకడం, దానం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం, అహింసని పాటించడం అనే నాలుగు కూడా ఉత్తమ ధర్మములు. కానీ అందులో అహింస విశేషమైనది. మనిషికి దేవత జన్మ, జంతు జన్మ, మానవ జన్మ కలుగు జన్మలు. దానం మరియు కర్మలను పాటించి అహింస వ్రతం ఆచరించినవారు దైవత్వాన్ని పొందుతారు. హింస చేసేవాడు జంతువుగా పుడతాడు. అందుకే అహింస పరమ ధర్మంగా పరిగణించ బడుతుంది అని జవాబిచ్చాడు.

ఇది విన్న నహుషుడు భీముడిని వదిలాడు. అప్పుడు సర్ప రూపం వదిలి శాపం తొలగిపోయి తిరిగి మల్లి మనిషి రూపాన్ని పొందాడు.

Exit mobile version