Home Unknown facts అతిపురాతన కొల్హాపూర్ భవాని ఆలయ రహస్యం

అతిపురాతన కొల్హాపూర్ భవాని ఆలయ రహస్యం

0

మన దేశంలో ఉన్న అతిపురాతన అమ్మవారి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఒకప్పుడు ఈ ఆలయం చుట్టూ దాదాపుగా 200 చిన్న ఆలయాలు అనేవి ఉన్నవని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం మూడు రోజులు ఈ ఆలయంలో ఒక విశేషం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kolhapur Shree Mahalaxmi Devi

కర్ణాటక లోని హుబ్లీ నుండి మహారాష్ట్ర లోని పూణే వెళ్లే రైల్వే మార్గం మధ్యలో మీరజ్ అనే జంక్షన్ కి పడమరగా కొన్ని కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్ ఉంది. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన నగరాలలో ఈ కొల్హాపూర్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. అయితే ఈ కొల్హాపూర్ లో శ్రీ మహాలక్షి దేవాలయం ఉంది. అయితే అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ మహాలక్మి ఆలయం కూడా ఒకటి గా పేర్కొంటారు.

ఇక్కడ ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని భవాని,కరవీరవాసిని మరియు అమలాదేవి అని పిలుస్తుంటారు. అయితే ఈ ఆలయం చుట్టూ కూడా దాదాపుగా 200 చిన్న మరియు పెద్ద దేవాలయాలు ఉండేవంటా. కానీ భూకంపం కారణంగా చాలా ఆలయాలు నెల మట్టం అవ్వగా, మరి కొన్నింటిని మహమ్మదీయ రాజులూ అక్కడికి దండెత్తడానికి వచ్చినప్పుడు నాశనం చేసారని చరిత్ర చెప్పుతుంది.

ఈ మహాలక్ష్మి ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. అమ్మవారి గర్భగుడి చుట్టూ సన్నని ఇరుకైన ప్రదక్షిణ మార్గం ఉంది. ఈ గర్భగుడిలో ఆరడుగుల ఎత్తయిన వేదిక ఒకటి ఉంది. ఆ వేదికపైనే రెండు అడుగుల ఎత్తు మీద ఉన్న పీఠం పైన అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు కూర్చొని దర్శనం ఇస్తారు. ఇచట అమ్మవారికి బంగారు పాదుకలు ఉన్నాయి. ఈ గుడిలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు.

ఈ ఆలయములో ప్రతి సంవత్సరం మార్చి 21 నుండి 3 రోజుల పాటు అదేవిధంగా సెప్టెంబర్ 21 నుండి 3 రోజుల పాటు గర్భ కిటికీ నుండి సూర్యకిరణాలు అనేవి అమ్మవారి పాదాలకి తాకుతాయి. ఇలా సంభవించడాన్ని భక్తులు బంగారు స్నానం అని పిలుస్తుంటారు. ఈ సూర్య కిరణాలూ అనేవి సాయంకాలం సమయంలో పడతాయి.

ఇంతటి విశేషం ఉన్న మహాలక్ష్మి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version