Home Unknown facts శ్రీమహావిష్ణువు యొక్క పాదముద్ర ఉన్న పుణ్యస్థలం ఎక్కడ ?

శ్రీమహావిష్ణువు యొక్క పాదముద్ర ఉన్న పుణ్యస్థలం ఎక్కడ ?

0

శ్రీ మహావిష్ణువు యొక్క పాదముద్రలు ఉన్న ఈ క్షేత్రం హిందువులకి, బౌద్దులకి పవిత్ర యాత్ర స్థలం అని చెప్పవచ్చు. బుద్దుడికి ఇక్కడే జ్ఞానోదయం అవ్వగా, ఇక్కడ విష్ణుపాదం ఇంకా అష్టాది శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంతో పాటు మరికొన్ని ఆలయాలను మనం దర్శనం చేసుకోవచ్చు. మరి విష్ణుపాదం ఉన్న ఈ పుణ్యస్థలం ఎక్కడ ఉంది? ఇక్కడ దాగి ఉన్న మరికొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vishnupad Mandir Gaya

బీహార్ రాష్ట్రం, గయా లో ఫాల్గుణ నది తీరాన శ్రీమహావిష్ణువు యొక్క పాదముద్రలు ఉన్న ఆలయం ఉంది. ఇక్కడ 13 అంగుళాల పొడవు ఉన్న శ్రీమహావిష్ణువు యొక్క పాదముద్ర ఉండగా, పాదముద్ర చుట్టూ అష్ట కోణ ఆవరణం వెండితో నిర్మించారు. ఈ ఆలయాన్ని అహల్యాబాయి అనే రాణిగారు నిర్మించారు. విష్ణుపద మందిరానికి దగ్గరలో ఫల్గుణి నది తీరములో ఈ మంగళగౌరి దేవాలయం ఉంది. మన దేశములో ఉండే అష్టాదశ శక్తి పీఠాలలో ఈ మంగళ గౌరీ దేవాలయం కూడా ఒకటి.

ఇక పురాణానికి వస్తే, పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. అయితే శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయగా, అయన తపస్సుకి మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యేక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగగా, నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్దాలకన్నా పవిత్రంగా ఉండేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. ఆ వరంతో గయాసురుడి శరీరం పవిత్రమైపోగా, అతడి శరీరాన్ని ఎవరు తాకిన పవిత్రమైపోయేవి. ఒకసారి బ్రహ్మ దేవుడు అతడి తలమీద యాగం చేయాలనీ భావించి, యాగం చేస్తుండగా ఆ యాగం వేడికి గయాసురుడి తల కదలడం మొదలవ్వగా, అప్పుడు బ్రహ్మ దేవుడు శ్రీమహావిష్ణువుని ప్రార్దించడంతో, శ్రీమహావిష్ణువు తన కుడికాలితో గయాసురిడి తలపైన పెట్టి నొక్కి పట్టుకున్నాడు. ఆవిధంగా శ్రీమహావిష్ణువు గయాసురిడి తలని కుడికాలితో నొక్కి పట్టుకున్న చోటే స్వామివారి పాదముద్ర ఇప్పటికి మనకి దర్శనమిస్తుంటుంది.

గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధగయ అనే ప్రాంతం ఉంది. సిద్ధార్థుడు ఇక్కడే గౌతబుద్ధినిగా మారాడని చెబుతారు. అయితే గౌతమ బుద్దిడికి ఈ ప్రదేశంలోనే జ్ఞానోదయం కలిగినదని కనుక ఇది బుద్ధగయ గా పిలువబడుతుంది. ఇక్కడి బుద్ధగయలో అన్నిటికన్నా అతిముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది బోధి వృక్షము. ఈ బోధివృక్షం ఉన్న ఆలయాన్ని మహాబోధి అని అంటారు.పూర్వం ఇక్కడ బోధివృక్షం మాత్రమే ఉండేది, కొంతకాలం తరువాత ఆ చెట్టు మొదట్లో అశోకుడు ఆసనం కట్టించాడు. దీనినే వజ్రాసనం అని అంటారు.

ఇక్కడ పితరులకు పిండప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చి పితరులకు పిండప్రదానం చేసినట్లు పురాణం చెబుతుంది. ఈవిధముగా విష్ణుపాదం, శక్తిపీఠం, బోధివృక్షం ఉన్న ఈ పవిత్ర స్థలంలో అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నవి. వీటిని దర్శించడం కోసం భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version