Home People IPS Officer Chandana Deepthi’s Fb Posts Are Thought Provoking & Motivational

IPS Officer Chandana Deepthi’s Fb Posts Are Thought Provoking & Motivational

0

Chandana Deepthi Medak SP ga pani chesthunna ee IPS officer ki ‘People’s Officer’ ga peru undi. Eppudu public kosam active ga pani chese ee police officer Medak lo crime rate tagginchadam lo success ayyaru. Delhi IIT campus nundi Computer Science graduation chesi all of sudden adi manesi IPS side vaccharu Chandana garu. IIT nundi IPS vaipu ravadam konchem strange thing kani enduku ani adigithe?

chandana deepthi

College loki enter aiyye time lo manam em avvali anedhi manaki clear idea undadu. Kani college ending ki vacche sariki oka clear cut idea vacchestundi same ilage Chandana Deepthi gari vishayam lo kuda jarigindi. IIT complete aiyye time ki IAS and IPS avudam anukunnaru Chandana Deepthi garu. 3rd attempt lo IPS crack chesi chinna age lo service start chesina Chandana Deepthi garu Medak Superintendent of Police ga duty cheyadame kadu women empowerment, Department ‘Bharosa’ programme dwara violence and crime valla suffer aiyye Women and Children ki counselling isthu chala mandi women ki supportive ga untunnaru.

Work and other activities lo entha busy ga unna Facebook lo matram eppudu active ga untaru. Active ga undadam ante Facebook wall meedha roju telugu lo daily life things ni poetic ga inspiring ga rastuntaru. And ee posts chusina taruvatha ee IPS lo unna maro angle teliyadame kadu police officer anna respect kanna poet ga ime meedha marintha respect perugutundhi.

1. Message to youth !

మరోసారి గుర్తు చేస్తూ…
ఉడుకు రక్తం ఎగసిపడే ఓ యువకుడా.., నువ్వు మందు కొట్టి తాగి పడేసే సీసాలో నీ రక్తాన్ని ఎగసిపడనివ్వకు.. నువ్వు గమ్ముగా తాగే దమ్ము పీలుస్తున్న పొగలో నీ రక్తం వృధా కానివ్వకు.. నీ రక్తం ఉవ్వెత్తున ఎగసిపడాల్సింది, భారతదేశ పల్లెల్లో… వారి ఇళ్ళల్లో, వారి ఇళ్ళ గడపల్లో..! నువ్వు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఏదైనా చేయగలవు… ఏమైనా నిరూపించగలవు!! ఎందుకంటే నీ ఆలోచన అద్భుతం.., నీ ఆశయం ఆకాశం!!

2. Sweet Lines on Childhood !

పాఠశాల దశ: బాల్యం 🙂
తెలిసి తెలియని వయసు… ఉరకలేసే ఉత్సాహం… ఒక చోట నిలవకుండా ఎప్పుడు పరుగెత్తాలనిపించే కాళ్ళు… ఆడే ఆటల్లో చిన్న దెబ్బలు… అమ్మ అదిలింపులు… నాన్న బెదిరింపులు… అనుబంధాలంటే తెలియని అభిజ్ఞానం… ఆలోచన లేని ఆవేశం… దేనికి వెనుకాడని ధైర్యం… అర్ధమే తెలియని ఆనందం… వెకిలి చేష్టలు… మకిలి రూపాలు. అదొక అద్భుతం… అదోక అనిర్వచనీయం. ఈ దశని వర్ణించాలంటే పదాలు చాలవు 🙂

3. Importance of plants and environment !

వర్షకాలం ప్రారంభమయ్యి ప్రకృతి పులకరిస్తుంది. మనల్ని ప్రకృతి పరవశించేలా చేస్తుంది. అలా ఎప్పుడూ తన ఒడిలో సేద తీర్చుతున్న ప్రకృతికి మన వంతుగా ఏమిద్దాం…!! ఒక్క మొక్కను నాటి ప్రకృతికి బహుమతిగా ఇద్దాం. ఒకే ఒక మొక్క… ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటితే మనం ప్రకృతికి అంతకన్నా ఇచ్చే బహుమతి ఇంకేముంటుంది. మొక్కల్ని నాటి పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి. మొక్కను నాటడమే కాదు ఆ మొక్కను దత్తత తీసుకొని మీ వంతు బాధ్యతగా ఆ మొక్కను కాపాడండి.

4. Some motivation to strugglers.

మరోసారి!!
కడుపు నిండిన వాడికేం తెలుసు నా కడుపు ఖాళి ఉందని…! ఆసాంతం ఆకు నాకాకా అడగటమెందుకు ఆకలేస్తుందా అని…!! ఎవరైనా ఎన్నైనా నీతులు చెప్తారు కానీ ‘కాలే’ వాడికే తెలుస్తుంది “ఖాళి” విలువ… ఒక దారి తప్పిన ఉరకలెత్తే వయసు గల సగటు యువకుని మాటలివి…!
సంపాదన, సంపాదించటం అనేది జీవనవిధానం కానీ అదే జీవితం కాదనే కఠోర సత్యాన్ని తెలుసుకున్నప్పుడే ఆ యువకుడు “నిజం” అనే అసలైన జీవితం ప్రారంభిస్తాడు. అప్పటివరకు ఆ అబద్దపు విషకోరల్లోనే కొట్టుమిట్టాడుతుంటాడు.

5. Beautiful words on Anger management and Self Control !

క్షణికావేశం… ఉద్రేకం… ఈ పదాలు జీవితంలో తీవ్ర గంభీరత్వంతో కూడుకొని ఉంటాయి.
ఆవేశపూరితమైన ఒక్క క్షణం… ఒకే ఒక్క క్షణం… ఆ ఒక్క క్షణం చాలు కుటుంబాలు చిన్నాభిన్నం కావటానికి, సమాజంలో నల్లటి మరకలు పడటానికి, జీవితాలు చాలించటానికి…!! భారతదేశ జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో దాదాపు 26% మంది ఆ ఒక్క క్షణంలో వచ్చే ఆవేశాన్ని అణచుకోలేకనే నాలుగు గోడల మధ్య నరకం అనే శిక్షను అనుభవిస్తున్నారు.
గుర్తుంచుకోండి!! క్షణికావేశం విలువ ఒక ప్రాణం అయ్యుండచ్చు, ఎంతో మంది ఆర్తనాదాలు అయ్యుండచ్చు. ఆ ఒక్క క్షణం నువ్వు చూపించే ఆవేశాన్ని అణచుకుంటే జీవితానికి ఉండే రెండోవైపును ఆస్వాదించవచ్చు. ఆ క్షణంలో వచ్చే ఆవేశమనే మరకను చిన్న చిరునవ్వుతో చెరిపేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు.

6. Lines on life and death !

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం రెప్ప పాటు కాలమే జీవితం… ప్రముఖ కవి అన్న మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సృష్టిలో మనిషి దేనికన్నా భయపడతాడు అంటే అది ముమ్మాటికి మరణానికే…
మన మరణం మనదైనంత వరకూ… నలుగురిలోనే ఉన్నంతవరకు మన కథ మరణంతోనే ముగిసిపోయి కాలగర్భంలో కలిసిపోయే పత్రం మాత్రమే.
అదే మరణం లోకాన్ని ఒక్కసారి కుదిపిందంటే… మనం చరిత్ర పుటలకెక్కిన అక్షరాలం.
అప్పుడనిపిస్తుంది మరణమంటే.. ముందే రాయబడిన విజయమని!!

7. Awnu madam Raithu eh Raju Raithu eh Raraju !

అతని చేతులు నేలను నిమిరి రక్తమోడుతున్నాయి… అయినా అతడు రాజే.
అతని అరికాళ్ళు పుండ్లవుతున్నాయి… అయినా అతడు రాజే.
అతని శరీరంపై చీడ పురుగులు నాట్యం చేస్తున్నాయి… అయినా అతడు రాజే.
అతనికి కాలం కలిసిరాక కరువే విషమై కాటేస్తుంది… అయినా అతడు రాజే.
అవును అయినా అతను రాజే. ఎందుకంటే…
అతని నెత్తిన చెమటనే కీరిటం ఉంది.
అతని శరీరం మొత్తం పచ్చదనం అనే బంగారం పరుచుకుని ఉంది.
అతడు నమ్ముకున్న నేలే అతన్ని నడిపిస్తుంది.
అతడే రైతు…రైతే రారాజు.
ఆ రారాజు ఇప్పుడు అప్పుల కొలిమిలో ఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యి.. అన్నం పెట్టిన చేత్తో దండం పెడుతూ ఆకాశంవైపు దేహి అంటూ ఆబగా చూస్తున్నాడు. నెత్తుటి సంతకాల సంతాపాల్లో, కత్తులుదూసిన నేలలో నకిలీ విత్తులు కొనలేక సాటి మనిషి వైపు నిస్సహాయంగా న్యాయం చేయమని చేయి చాస్తున్నాడు.
అలాంటి రారాజుని నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నవారిని ఏం చెయ్యాలి??

అతని చేతులు నేలను నిమిరి రక్తమోడుతున్నాయి… అయినా అతడు రాజే.
అతని అరికాళ్ళు పుండ్లవుతున్నాయి… అయినా అతడు రాజే.
అతని శరీరంపై చీడ పురుగులు నాట్యం చేస్తున్నాయి… అయినా అతడు రాజే.
అతనికి కాలం కలిసిరాక కరువే విషమై కాటేస్తుంది… అయినా అతడు రాజే.
అవును అయినా అతను రాజే. ఎందుకంటే…
అతని నెత్తిన చెమటనే కీరిటం ఉంది.
అతని శరీరం మొత్తం పచ్చదనం అనే బంగారం పరుచుకుని ఉంది.
అతడు నమ్ముకున్న నేలే అతన్ని నడిపిస్తుంది.
అతడే రైతు…రైతే రారాజు.
ఆ రారాజు ఇప్పుడు అప్పుల కొలిమిలో ఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యి.. అన్నం పెట్టిన చేత్తో దండం పెడుతూ ఆకాశంవైపు దేహి అంటూ ఆబగా చూస్తున్నాడు. నెత్తుటి సంతకాల సంతాపాల్లో, కత్తులుదూసిన నేలలో నకిలీ విత్తులు కొనలేక సాటి మనిషి వైపు నిస్సహాయంగా న్యాయం చేయమని చేయి చాస్తున్నాడు.
అలాంటి రారాజుని నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నవారిని ఏం చెయ్యాలి??

8. And her take on What Is Love ?

కొందరు యువతీయువకులు ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమలో పడ్డాం అంటారు..! అసలు ఈ ప్రేమంటే అర్ధం తెలియకుండా ఎందరో యువతీయువకులు బాధితులుగా, బాధ్యత లేని అప్రయోజకులుగా మిగిలిపోతున్నారు.
ప్రేమంటే Whatsapp తెరపై నిత్యం కదలాడే సందేశం కాదు.
ప్రేమంటే కారులో షికారుకెళ్ళి ఒక నాలుగు పుకార్లు సృష్టించుకోవటం కానే కాదు.
ప్రేమంటే నడిరోడ్డులో నాలుగు పెదాలు కలిసి చేసే పని అంతకన్నా కాదు.
మరి ప్రేమంటే…? ప్రేమంటే పాఠమా….? ప్రేమంటే బాధ్యతా….?? ప్రేమంటే అందమా….?? మరి ప్రేమంటే ఏంటి ….
మనం తల్లి గర్భం నుండి బయటపడ్డాక ఏ కల్మషం లేకుండా మనల్ని తొలిసారి చూస్తుంది చూడు…. అదే ప్రేమంటే!! ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించింది లేనే లేదు. తల్లి చనుపాలంత స్వచ్ఛమైనది ఆ ప్రేమ…!! ఎవరెస్టు శిఖరమంత ఎత్తైనది ఆ ప్రేమ.

9. Amma ante ????

‘అమ్మ’ అంటే ఆనందం
‘అమ్మ’ ఇవ్వటానికి అందరి కన్నా ముందుండే అవని
‘అమ్మ’ అంటే ఆది గురువు
‘అమ్మ’ అంటే ఆప్యాయతకు మొదటి రూపం
‘అమ్మ’ అంటే బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చే వాహకం
‘అమ్మ’ అంటే ఋతువులను నింపుకున్న ప్రకృతి
ఏ కవి కలానికి అందనిది…. ఏ సూక్ష్మదర్శినికి చిక్కనిది “అమ్మ”

10. Yuvatha ante evaru ?

యువత అనే పదం ఎంత అద్భుతమైన పదం.. యువతకు శక్తి, ఉడుకు వేగం, నిర్లక్షం, ఆవేశం, ఉద్రేకం, ఆకర్షణ, కెరటం, పందెం ఇలా ఎన్నో పర్యాయ పదాలను ఇవ్వచ్చు.. ఏముంది మరి ఆ యువతలో…. ఆకాశానికి నిచ్చెనలు వేయగల దమ్ముంది.. కలలు కనే స్వేచ్చ ఉంది… కిరణాలని కెరటాలని అరచేత్తో అదిమి పట్టగల బలముంది. వారి ఆలోచన అద్బుతం.., ఆశయం ఆకాశం.., ఆ ఆలోచనలు, ఆ ఆశయాలు ఆచరణాత్మక దిశగా సాగితే ఏమైనా చేయగలరు… ఏదైనా నిరూపించగలరు…! దేశాన్ని పరుగెత్తించగల సత్తా ఉన్న యువతీయువకులందరికి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.

What a gem of poetry mamdam, society need a more officers like you and inspirational poetry like this.

Exit mobile version