నరసింహ స్వామి ఆలయాలు మిగతా దేవాలయాలకు బిన్నంగా ఉంటాయి. కొన్ని ఆలయాల్లో స్వామి వారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తే కొన్ని ఆలయాల్లో యోగ రూపంలో కనిపిస్తారు. నరసింహ ఆలయాలకు వచ్చే భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో స్వామిని దర్శించుకుంటారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహ స్వామి ఆరాధన కనిపిస్తుంది. నవనారసింహ క్షేత్రాలతో పాటుగా ఆయనకు అడుగడుగునా పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి.