Home Unknown facts kanipakamlo velisina Swayambhu varasiddhi vinayakudu

kanipakamlo velisina Swayambhu varasiddhi vinayakudu

0

ఈ ఆలయంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామికి కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే ఎన్నో పురాతన ఆలయాలు ఇప్పటికి ఉన్నాయి. అయితే ఇక్కడ వినాయకుడు ఎలా వెలిసాడు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. kanipakamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి దగ్గరలో కాణిపాకం ఉంది. ఈ పుణ్యక్షేత్రం బహుధా నది ఉత్తరపు ఒడ్డున ఉంది. పూర్వం ఇక్కడ దేవతలు విహరిస్తుండేవారంటా అందుకే ఈ ప్రాంతాన్ని విహరపురి అని పిలుస్తారు. ఇక్కడ వెలసిన వినాయకుడి మహిమలను చాల కథలుగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో ఉన్న శాసనాల ప్రకారం 11 వ శతాబ్దంలో మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించారు. ఆ తరువాత 15 వ శతాబ్దంలో విజనగర రాజులూ విస్తరించారని తెలుస్తుంది. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకప్పుడు శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు అందులో తమ్ముడికి ఆకలి విపరీతంగా అవ్వడంతో అక్కడ ఉన్న మామిడి తోటలోని పండు తినాలని అనుకుంటాడు. ఆలా చేస్తే దొంగతనం ముద్ర పడుతుంది ఆలా చేయాడం తప్పు అని అన్న చెప్తాడు. కానీ విపరీతమైన ఆకలితో ఉన్న అతడు పండు కోసి తినడంతో ఆగ్రహించిన అన్న చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని ఆ ఉరి రాజు దగ్గరికి తీసుకెళ్లగా అయన రెండు చేతులు నరికేస్తాడు. ఇంత చిన్న దొంగతనానికి ఇంత ఘోరమైన శిక్షా వేస్తాడని శంఖుడు అనుకోలేదు. శంఖు,లిఖితులు స్వామివారికీ ప్రక్కన ప్రవహించు నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని అ నదిలోకి అన్నదమ్ములు ఇద్దరు దిగారు నదిలో వారుస్నానముకు మునిగినంతనే లిఖితునకు నరుక బడిన చేతులు పూర్వంలాగే వచ్చేశాయి. వారి ఆనందానికి అవధులు లేవు. నదిలో మునిగినంతనే పోయిన రెండు చేతులు తిరిగి వచ్చినవి కనుక ఆనాటి నుండి ఆ నదికి భాహుదా అనే పేరు స్తిరపడిపోయింది. నాటినుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు వినాయక స్వామి వారి మహత్యంను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ జీవించారు. స్థలపురాణం ప్రకారం, పుట్టుకతోనే ఒకరు గ్రుడ్డి, ఒకరు చెవిటి, ఒకరు మూగ అయిన ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామమునకు ఎక్కడినుండో వచ్చి స్తిరపడ్డారు. వారు ముగ్గురు ఒకరికొకరు సాయం చేసుకొంటూ కలిసి జీవించేవారు.వారు ఆ గ్రామంలో కొంత భూమిని సేకరించికొని అందులో ఒక నుయ్యిని త్రవ్వుకొని ఆ నీటితో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకొంటూ వుండేవారు.అలా కొంతకాలం జరిగాక విహార పురిలో కరువు ఏర్పడింది. వానలు లేకనేల భిటలువారింది. రైతులు,ప్రజలు పంటలకే కాదు. త్రాగు నీటికి కూడా చాలా భాదపడవలసి వచ్చింది.బహుదా నది ఎండి పోయిoది.అంటూ రోగాలు ప్రబలాయి.ప్రజలు ఆకులూ, అలములు తిని బ్రతకవలసిన పరిస్టితి ఏర్పడింది. ఇక అ వికలాంగుల పరిస్టితి మరి దయనీయంగా మారింది. ఒకనాడు అ ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని నూతిని మరికొంచెము లోతు చేయడం మంచిదని తలచి అందుకు నడుం కట్టారు. వారు ముగ్గురు బావిని త్రవ్వగా త్రవ్వగా కొంత తడి తగిలింది.నీరు కొద్ది కొద్దిగా ఉరుతోంది. బావిలో నుండి నీటిని ఫైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి కుండను వదిలారు.అది పగిలి పోయిoది.మళ్ళి మరొక కుండను వదిలారు.అది కుడా పగిలిపొయింది.అలా చాలా కుండలు పగిలిపోవడంతో బావిలోపల ఏదో ఒక రాయి ఉన్నట్లు ఉంది దానిని తొలగిస్తే ఇట్ల కుండలు పగిలి పోకుండా వుండటమే కాక మరికొంత నీరు ఉరుతోందని బావించి రాతిని పెకలించేందుకు చెవిటి, మూగ వారిద్దరూ బావిలోకి దిగారు. అట్లుఅడ్డు పడిన రాతిని పగులకొట్టి పూర్తిగా పెల్లగించాలనికొని వారు గునపంతో పదే పదే పోడవ సాగారు. త్రవ్వు తున్నఆ ప్రదేశంలో గునపం పడిన చోటు నుండి ఖంగు మనే శబ్దం వచ్చింది. అట్లు వారు మూడు సార్లు ప్రయత్న్నం చేయగామూడు సార్లు ఈ విధంగా శబ్దం వచ్చి చివరి దెబ్బతో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే అ ముక్క పగిలిన చోటు నుండి రక్తం యగ చిమ్మింది. అట్ల రక్తం యగ జిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభు వినాయకుని తల వెనుక భాగం చిట్లి ముక్క ఎగిరి పడడమే,ఆ రక్తం ఏక ధారగా కారుతూనే వుంది.ఎంతకు ఆగటం లేదు.ఆ రక్తం అలా యాగజిమ్మడంతో ఒడ్డున వున్న గ్రుడ్డివాడు,బావిలోపల ఉన్న మూగవాడు,చెవిటివాడు కుడా ఆ రక్తంతో తడిసారు. అలా వారు రక్తంతో తడియగానే మూగ వాడికి మాటలు గ్రుడ్డివాడికి ద్రుష్టి, చెవిటివానికి శ్రావణ శక్తి లబించాయి. ఆ ప్రభావంతో ముగ్గురి అంగవైకల్య్యం తొలగిపోవడంతో అది దైవకృపయే అని ఆనందంతో భక్తిపరవశులైవారు. ఆ దైవమూర్తి నుండి వెలువడే రక్త ప్రవాహంఆగకపోవడంతో దానిని వారించడానికి వారు చేయు ప్రయత్నములు ఫలించక పోవడంతోచూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగిదిఅంత పూస గ్రుచ్చి నట్లు రాజుకు వివరించాడు. ఈ విషయంను విన్న రాజులో ఆనందం, భయాందోళనలు కలిగి వచ్చి స్వామికి ఆలయం నిర్మిస్తాను అని చెప్పడంతో రక్తం కారడం ఆగిపోయిందని స్థల పురాణం.అయితే స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బిరి కాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. ఆ భక్తులు సమర్పించిన స్వచ్చమైన కొబ్బరినీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది. అంతకుముందు అంగ వికులులుగా నున్న ఆ ముగ్గరుకు చెందిన భూమి అంతట కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది. అదే మాట కాలక్రమంలో కాణిపాకం గా మారి స్టిర పడింది.ఇలా స్వామివారు ఆనాటి నుండి ఇప్పటివరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరు ఏదైనా తప్పు చేసిన, వివాదం వచ్చిన వారితో స్వామి యెదుట ప్రమాణం చేపిస్తారు. ఒకవేళ అబ్బడం చెప్పితే కొద్దీ రోజుల్లోనే శిక్షింపబడతారని, అందువల్లే ఎవరు అబద్దం చెప్పడం కానీ, స్వామి యెదుట చేసిన ప్రమాణం తప్పడం కానీ ఉండదని భక్తుల నమ్మకం. ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రానికి రోజు రోజుకి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది.

Exit mobile version