Home Unknown facts ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమివ్వబోతున్న ఖైరతాబాద్ వినాయకుడు

ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమివ్వబోతున్న ఖైరతాబాద్ వినాయకుడు

0

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాం. అయితే ఆదిదంపతులు అయినా పార్వతీపరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు జన్మించిన రోజే వినాయకచవితి అని చెబుతారు. ఈ పండుగని మన దేశంతో పాటు ఇతర దేశాలలో ఉన్న హిందువులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక వినాయకచవితి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రతి సంవత్సరం తన రూపంతో ఆకట్టుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం భక్తులకి ఎలా దర్శనం ఇవ్వబోతున్నాడు? అసలు ఖైరతాబాద్ వినాయకుడు ఏ సంవత్సరం నుండి మొదలైంది? ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

khairtabad Ganesh

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం వినాయకచవితి ని చాలా వైభవంగా జరుపుతారు. అయితే మొట్టమొదటగా 1954 వ సంవత్సరంలో ఖైరతాబాద్ లో ఒక్క అడుగు వినాయకుడి విగ్రహం తో వినాయక చవితి వేడుకలు అనే జరిపారు. ఈవిధంగా ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి కి ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వచ్చారు. అయితే ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ వినాయకుడు ఆలా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. ఇలా 60 సంవత్సరాల పాటు 60 అడుగులు పెరిగిన తరువాత మళ్ళి ఒక్కో అడుగు తగ్గిస్తూ మళ్ళీ తరువాతి 60 సంవత్సరాలకి ఒక్క అడుగు వినాయకుడిని ప్రతిష్టించాలని ఈ ఆలయ కమిటీ నిర్ణయించారట.

ఇది ఇలా ఉంటె, ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు సరికొత్త రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం 12 శిరస్సులు, 24 చేతులు, 12 సర్పాలు, 7 అశ్వాలతో కూడిన సూర్యరథంపైన వినాయకుడు శ్రీద్వాదశాదిత్య మహాగణపతి నామంతో కొలువు దీరనున్నారు. ఈ విగ్రహం ఎత్తు 61 అడుగులు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువు. ఇదే మంటపంలో వినాయకుడి పక్కన కుడివైపున సిద్ధకుంజికాదేవి, ఎడమవైపున దత్తాత్రేయుల విగ్రహాలు దర్శమివ్వనున్నాయి.

ఈ విధంగా భారీ ఆకారంతో దర్శనమివ్వనున్న వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 150 కళాకారులు మూడు నెలలు కష్టపడ్డారట. ఇక ప్రతి సంవత్సరం ఎన్నో ప్రత్యేకతలతో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి అనేక దూర ప్రాంతాల నుండి అనునిత్యం భక్తులు భారీగా తరలి వస్తుంటారు

Exit mobile version