Home Unknown facts Kobbari aakula paakalo velisina balabalaji devalayam

Kobbari aakula paakalo velisina balabalaji devalayam

0

కోనసీమలో రెండవ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గోదావరి నది తీరాన వెలసింది. మరి స్వామివారు కొబ్బరి ఆకుల పాకలో ఎందుకు వెలిశారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. balabalajiఆంధ్రపరదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా, మామిడి కుదురు మండలం నందు అప్పనపల్లి అను గ్రామంలో శ్రీ బాలబాలాజీ దేవాలయం ఉంది. అప్పనపల్లిలో రెండు బాలాజీ దేవాలయాలు ఉన్నాయి. పాత ఆలయం కొబ్బరి ఆకుల పాకలో ఉంటె, నూతన ఆలయం శిల్పకళ నైపుణ్యంతో విలసిల్లుతుంది. భక్తులు ముందుగా పాత ఆలయంలోని స్వామివారిని దర్శించి తల నీలాలు, కానుకలు సమర్పించుకుంటారు. శ్రీ బాల బాలాజీ స్వామివారికి ఇరువైపులా పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఆసీనులై ఉన్నారు.ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, ఈ గ్రామంలో నివసించే మొల్లేటి రామస్వామి అనే భక్తుడు కొబ్బరి వ్యాపారం చేస్తుండేవాడు. ఆ వ్యాపారం నష్టాలతో నడుస్తుండడంతో తిరుమల శ్రీవారికి వ్యాపారంలో వాటా పెడతానని మొక్కుకున్నారు. అప్పటినుంచి ఆ వ్యాపారం లాభాల బాటలో పయనించింది. దాంతో మొక్కుబడి ప్రకారం లాభంలో 10 శాతం వాటాను తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించేవారు. 1960వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తీసుకు వచ్చి కొబ్బరి కొట్టులో ప్రతిష్టించారు. లాభంలో కొంత వాటాను తిరుమల తిరుపతి తీసుకు వెళ్లి స్వామివారి పాదాల చెంత పెట్టేందుకు రామస్వామి ప్రయత్నించగా అర్చకులు అంగీకరించలేదు. అర్చకులతో వాదించి, వాదించి అలసి నిద్రిస్తున్న రామస్వామికి స్వప్నంలో శ్రీనివాసుడు సాక్షాత్కరించి తానే అప్పనపల్లి వస్తానన్నాడట. అన్నమాట ప్రకారం ముద్దులొలికే బాలుడి విగ్రహ రూపంలో కొబ్బరికాయల మధ్యన కనిపించాడట. ఆ ముద్దుల బాలుని చూసి మైమరచిన రామస్వామి కొట్టులో ప్రతిష్టించిన స్వామి వారికి బాల బాలాజీగా నామకరణం చేశారు. ఆ విధంగా ప్రతిష్టించిన శ్రీబాల బాలాజీ స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చేవారు.
ఈవిధంగా వెలసిన స్వామివారికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం గొప్పగా జరుగుతుంది.

Exit mobile version