Home Unknown facts భక్తుల కోరికలు నెరవేర్చే శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ రహస్యం

భక్తుల కోరికలు నెరవేర్చే శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ రహస్యం

0

ఈ అమ్మవారు భక్తుల కోరిన కోర్కెలు నెరవేరుస్తూ, భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఎంతో మహిమ గల దేవిగా పూజలందుకుంటుంది. అయితే కొన్ని సంఘటనల ఆధారంగా ఆ దేవి భక్తులను ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది ఐ స్థానికులు చెబుతున్నారు. మరి ఆ మహిమగల అమ్మవారు ఎవరు? ఈ ఆలయంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Dhaneshwari Templeఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు తాలూకాకు సుమారు 7 కి.మీ. దూరంలో దువ్వ అనే గ్రామంలో శ్రీ దానేశ్వరి అమ్మవారు అనే గ్రామదేవత కొలువై ఉన్నారు. శ్రీ దానేశ్వరి అమ్మవారు తేత్రాయుగం నుండి ఈ ప్రాంతంలో అదృశ్యరూపమున కొలువై ఉన్నట్లు తెలియచున్నది. అయితే పూర్వం దువ్వకు దుర్వాసపురం అని పేరు.దుర్వాస మహాముని అఖంగా తపస్సు చేసిన ప్రదేశమగుటచే ఈ ప్రాంతం అంత కూడా పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ గ్రామంలో 300 సంవత్సరాల క్రితం నిర్మించిన సీతారాముల దేవాలయం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉన్నవి.

అయితే మహత్తర తపశ్శక్తి సంపన్నుడైన దుర్వాస మహర్షిచే మంత్ర రాశిగా ప్రతిష్టించబడిన దేవియే శ్రీ దానేశ్వరి అమ్మవారు. ఈ చల్లని తల్లి సర్వజనులకు కటాక్షిస్తూ వారివారి కోర్కెలు తీరుస్తుంది. శ్రీ దానేశ్వరి – గంగాదేవి గొప్ప మహిమ గల తల్లి. ఈ ప్రాంత వ్యవసాయదారులు ఈ తల్లిని సేవిస్తూ తమ పంట పొలాలను కాపాడమని ప్రార్థిస్తూ వేడుకుంటారు.

దానేశ్వరి దేవి మహిమగల తల్లి అనుటకు ఒక నిదర్శనం 1950 – 51 సంవత్సర ప్రాంతంలో దువ్వ – ఉరదళ్లపాలెం లో నూతనంగా రోడ్డు మార్గం నిర్మించారు. అయితే కారు, లారీ డ్రైవర్లకు ఆ తల్లి మహిమ వల్ల బరువుతోను, వేగంగా వచ్చు లారీల ముందు చక్రాల టైర్లు హఠాత్తుగా పగిలిపోయిన గూడా లారీకి గాని డ్రైవర్లకు గాని ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతం చాలా శక్తివంతమైనది అని అపరాధం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని ప్రజలలో విశ్వాసం ఉంది. ఈ అమ్మవారి ప్రాంత భూములలో గల ధాన్యపు రాసులను ఎవరు దొంగిలించేవారు కాదంటా. ఇలా రైతులను, భక్తులను కన్న బిడ్డలవలె కాపాడుచూ తమ బిడ్డలకి ఎలాంటి కష్టాలు రాకుండా చూసే చల్లని తల్లిగా ఈ ప్రాంత ప్రజలలో బలంగా నాటుకుపోయింది.

ఈ విధంగా ఎంతో మహిమ గల ఈ తల్లిని దర్శించుకోవడానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version