డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా.. ఎంత కష్టపడినా అనుకున్న విధంగా సంపద సమకూరదు. ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో శ్రీ మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మి కటాక్షం కోసం కొన్ని పూజలు చేయాలి. ఫలితంగా లక్ష్మీ దేవి కటాక్షం పొంది సంపద, సంతోషాలు అందుబాటులోకి వస్తాయి. మరి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఎలాంటి పరిష్కార మార్గాలు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
లేదంటే మనిషికి మనశాంతి కరువు అవుతుంది.
డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు.
అంత కస్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురు అవుతాయి. ఆ సమస్యల బయట పడాలంటే లక్ష్మి దేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి.
అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి. ఆ తరవాత పొయ్యికి కుంకుమ బొట్టు పెట్టాలి.