Home Unknown facts లక్షీదేవి తమ ఇంటికి రావడానికి దీపాలు దారిచూపిస్తాయి!!!

లక్షీదేవి తమ ఇంటికి రావడానికి దీపాలు దారిచూపిస్తాయి!!!

0

దీపావళి రోజు సూర్యోదయానికి ముందే తలకు నువ్వుల నూనె అంటుకుని అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెలో లక్ష్మీ, మంచి నీటిలో గంగా దేవి కొలువై ఉంటారు. అమావాస్యరోజున దీపావళి ముహుర్తంలో లక్ష్మీ దేవికి పూజలు నిర్వహించాలి. తెల్లవారు జామున మంగళ స్నానం ఆచరించి మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు శ్రార్ధము, బ్రహ్మణులకు భోజనం పెట్టాలి. సాయంత్రం పుష్పాలు, ఆకులుతో అలకరించి లక్ష్మీ, విష్ణువు, కుభేరుడిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.

diwali lightsఆశ్వయుజ కృష్ణ అమావాస్య దీపావళి అమావాస్య దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమీయబడే దినంకావడంచేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది.
నరకలోకవాసులకై దీప + ఆవళి కల్పించే దినము కాబట్టి దీనికి దీపావళి అనే పేరు వచ్చింది. హిందూ మత సంస్కృతికి, హిందూమత సంప్రదాయానికి దీపావళిపర్వం ఒక చిహ్నమని చెప్పవచ్చు.

రాక్షసరాజైన బలిచక్రవర్తి పాతాళానికి విష్ణువుచే అణగదొక్కబడిన దినం కావడంచేత ఇది ఒక మహోత్సవ దినంగా పరిగణించబడుతూ ఉంది.

శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన దినం కావున మహోత్సవం ఏర్పాటైంది.

విక్రమశక స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం పొందిన దినం. లక్ష్మీదేవి ఈనాడు భూలోకానికి దిగి వచ్చి ఇల్లిల్లు తిరుగుతుందని ప్రజల విశ్వాసం. కాగా గృహాలు శుచిగా ఉంచాలి.

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి – దీనికే ధనత్రయోదశి అని పేరు, మధ్యాహ్నం పిండి వంటలతో భోజనం, భోజనానంతరం జూదం ఆడడం, లక్షీదేవి తమ యింటికి రావడానికి దారిచూపేందుకు దీపాలు,
మహారాష్ట్రలో దీపావళి ఐదు రోజుల పండుగ. దీపావళి అనగా దీపాలసమూహమని అర్థం.

ఈ పర్వ దినం మహారాష్ట్రలో అతి ప్రాచీన కాలం నుంచి వున్నట్లు కనిపిస్తుంది, వామనమూర్తి బలిచక్రవర్తిని పాతాళ లోకంలోకి అణిచివేసి అతని కారాగారంలో వున్న దేవతల్ని విడుదల చేశాడు.

దేవతలు బలి ఖైదు నుంచి విడుదల పొంది లక్ష్మితో క్షీరసాగరానికి చేరి పొందిన ఆనంద దినాలకి స్మారకంగా ఈ పండుగ ఏర్పడింది. ఈ పండుగ లక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టే దీపావళి సందర్భంలో లక్ష్మిపూజ ప్రధానకార్యమై వుంటుంది.

Exit mobile version