Home Unknown facts అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో తెలుసా?

అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో తెలుసా?

0

ధర్మరాజు ఒకరోజు దివ్యాస్ర్తాలను తీసుకురమ్మని అర్జునుడిని పంపగా అప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించాలని అనుకుంటాడు. మరి శివుడు అర్జునుడితో ఎందుకు యుద్ధం చేస్తాడు? చివరకు అర్జునుడు శివుడి అనుగ్రహాన్ని ఎలా పొందుతాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shiva arjunaధర్మరాజు ఇంద్రుడి దగ్గర ఉన్న అస్రాలను తీసుకురమ్మని చెప్పగా అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడిని అస్రాలను ఇవ్వమని అడుగగా, అప్పుడు ఇంద్రుడు అర్జునుడితో నీవు శివుడిని ప్రసన్నం చేసుకోగలితే ఆ అస్రాలు నీకు లభిస్తాయని షరతును పెడతాడు. ఇంద్రుడు చెప్పిన మాట ప్రకారం అర్జునుడు ఇంద్రకీలా పర్వతాన్ని చేరి శివుడి కోసం తపస్సు చేస్తుంటాడు. అప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించాలని భావించి తానె స్వయంగా ఒక కిరాతకుడిగా మారి త్రిశూలాన్ని విల్లుగా మార్చుకొని మారువేషంలో వస్తాడు.

మూకాసురుడిని ఒక పంది రూపంలో అర్జునుడి దగ్గరికి పంపగా, మూకాసురుడు అర్జునుడి తపస్సుని భంగం కలిగించడానికి చాలా విధాలుగా ప్రయత్నించగా, తపస్సు భంగం కలిగిన అర్జునుడు పంది రూపంలో ఉన్న మూకాసురుడి పైన బాణాలు వేస్తాడు. ఆ సమయంలోనే కిరాతకుడు రూపంలో ఉన్న శివుడు కూడా మూకాసురిడిపైన బాణాలు వేస్తాడు. అప్పుడు మూకాసురుడు చనిపోగా అది నేను వేసిన బాణాల వలెనే చనిపోయిందని కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు అనగా, లేదు నేను వేసిన బాణాల వలెనే అది చనిపోయినదని అర్జునుడు అంటాడు.

అప్పుడు కిరాతకుడు జంతువులను వేటాడేది మేము, దానిని చంపింది నేనే అంటూ వాదించగా అర్జునుడికి కోపం వస్తుంది. ఆ మాటలు కాస్త ఇద్దరి మధ్య యుద్దానికి దారి తీస్తుంది. అర్జునుడు శివుడితో యుద్దానికి దిగి బాణాలను సందిస్తుండగా ఒక్క బాణం కూడా శివుడిని ఏమి చేయలేకపోతాయి. అప్పుడు శివుడు ఒకే ఒక్క బాణాన్ని అర్జునుడి పైకి సందించగా ఆ దెబ్బకి అర్జునుడు కింద పడిపోతాడు. అయినా అర్జునుడు తన ఓటమిని అంగీకరించకుండా బాణాలను సందించబోతుండగా ఒక్కసారిగా మూల్లోకాలన్నీ కంపించాయి. నాలుగువైపులా ఘోర గాలులు వీస్తూ, భూ ప్రపంచం అంతా వినాశనం అవుతున్నట్టు కనిపించింది. ఆ సమయంలో అర్జునుడికి అర్ధం అవుతుంది అక్కడ ఉన్నదీ కిరాతకుడు కాదు ఆ రూపంలో ఉన్న శివుడు అని అర్ధం చేసుకొని తన తప్పుని తెలుసుకొని శివుడు కాళ్ళమీద పడి క్షమించమని వేడుకుంటాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా ఈ విధంగా శివుడు  అర్జునుని అనుగ్రహించేందుకు ఒక పరీక్షను పెట్టి, కిరాతకుని రూపాన్ని ధరించాడు.

Exit mobile version