Home Unknown facts మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసా ?

మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసా ?

0

ఈ ఆలయ గర్భగుడిలో అసలు గాలి అనేది రాకుండా, కనీసం కిటికీలు, రంద్రాలు లేకుండా నిర్మించిన అప్పటి టెక్నాలజీ ఇప్పటికి ఎవరికీ అర్ధం కాదు. ఇక్కడ ఉన్న వైట్ హౌస్ దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. ఇంకా చెప్పాలంటే గోపురం పైన ఉన్న శిల్పాలను గమనిస్తే రోదసీలోకి వెళుతున్న వ్యోమగాములని తలపిస్తాయి. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ దాగి ఉన్న మరిన్ని ఆశ్చర్యకర నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mahabalipuram Temple

తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లాలో మహాబలిపురం కలదు. ఇవి యునెస్కో వారి చేత సంరక్షించబడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అయితే 7 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ రాజుల రాజ్యానికి ప్రముఖ తీర పట్టణం. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్లా పేరు మీద కట్టించబడిందని చరితకారుల అభిప్రాయం. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వలన మహాబలిపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఉన్న గుహాలయాలు ప్రతి పర్యాటకున్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.

పల్లవులు పరిపాలన కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగంగా వెలుగొందింది. ఇంకా వీరు దీనిని మంచిరేవుపట్టణం గా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ నిర్మించారు. ఒక అధ్బుతమైన శిల్పకళా స్థావరం అయినా మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఏంటనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ రాక్:


ఏటవాలు కొండపైన ఏ ఆధారం లేకుండా పురాతన కాలం నుండి పడిపోకుండా అలానే ఉంది. ఇది చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి ఉంటాయి. ఇంకా అరకిలోమీటరు పొడవులో ఉండే పాండవ రథాలు, అతి సుందరమైన సీషోర్ టెంపుల్ ఉన్నాయి. సముద్రం ఒడ్డున అందమైన గోపుర గుడి కూడా ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు పెద్ద పెద్ద శిలలతో చెక్కబడ్డాయి. వీటినే గుహాలయాలు అంటారు. 600 – 700 సంవత్సరాల మధ్య మహాబలిపురంలో పల్లవరాజుల ఆధ్వర్యంలో శిల్పులు పెద్ద పెద్ద శిలలకు హస్త కళా నైపుణ్యంతో జీవంపోసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

అయితే 7 వ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలా రథాలు పాండవుల రథలంటారు. ఈ ఐదు రథాల్లో నాలుగు ఏకశిలలతో నిర్మించబడినవి. పల్లవుల కళా నైపుణ్యానికి వీటిని ప్రతీకలుగా చెబుతారు. దక్షిణభారతదేశంలోనే పురాతనమైన ఆలయం షోర్ టెంపుల్. ఇది 8 వ శతాబ్దంలో ద్రావిడులు శైలిలో నిర్మించబడింది. ఇక్కడ గణేశుడి గుడి కూడా చక్రాలతో కూడిన రాతి రథంగా మలచబడి ఉంటుంది.

ఇక్కడ నిర్మించిన 9 గుహాలయాలు ఉన్నాయి. ఒక గుహాలయంలో మహిషాసుర మండపం ఉంది. ఈ మండపంలో మహిషాసురుడికి మరియు శక్తికి దేవతగా చెప్పే దుర్గ మాతకి పోరాటం, రాక్షసులను సంహరించే దృశ్యం చెక్కబడింది. ఇక్కడ నల్లరాతితో చెక్కబడిన నంది, సింహం, ఏనుగు మొదలగు శిలా రూపాలు సజీవంగా కనిపిస్తాయి. ఇంకా కృష్ణ మంటపంలో రాతిమీద భాగవత కథ శిల్పరూపంలో అధ్బుతంగా చెక్కబడి ఉంది.

ఇలా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పర్యాటకుల చూపు తిప్పనివ్వకుండా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Exit mobile version