Home Unknown facts విష్ణు మూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడానికి కారణం?

విష్ణు మూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడానికి కారణం?

0

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా ఉన్నాయి.

Sati Deviచాలా మందికి శక్తి పీఠాల గురించిన కథ తెలిసే ఉంటుంది. తండ్రి పిలవక పోయినా పుట్టింటిపై ప్రేమతో దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళిన సతీ దేవికి అక్కడ అడుగడుగునా తిరస్కారం లభిస్తుంది. అంతే కాక భగవంతుడైన శివుని కూడా దక్షుడు దుర్భాషలాడుతాడు. తనకు కలిగిన తిరస్కారాలను సహించగలిగినా శివ నిందను వినలేని సతీ దేవి అక్కడికక్కడే యోగాగ్నిలో దగ్ధమవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రుడిని, ప్రమథ గణాలను పంపి దక్ష యజ్ఞం ధ్వంసం గావిస్తాడు.

సతీ విరహం తో యోగాగ్నిలో దగ్ధం కాగా మిగిలిన శరీరాన్ని భుజంపై వేసుకొని లోకమంతా తిరగడం మొదలు పెడతాడు. శివుని ఈ స్థితిని చూసిన లోకం భయభ్రాంతమై శ్రీ మహా విష్ణువు ను శరణు కోరగా ఆయన రహస్యంగా శివుని వెంబడిస్తూ తన సుదర్శన చక్రంతో సతీ దేహ భాగాలను అక్కడక్కడా ఖండిస్తూ శక్తి పీఠాలను నెలకొల్పుతాడు.

ఉత్తర భారత దేశంలో ఎక్కడకి వెళ్ళినా 50/51/52 శక్తి పీఠాల గురిచి చెబుతారు. అందరికీ ప్రామాణికం అయిన దేవీ భాగవతం శక్తి పీఠాల సంఖ్య 108 అని తెలియచేస్తుంది.

 

Exit mobile version