Home Unknown facts శివుడు అమర్ నాథ్ గుహకి వెళ్లేప్పుడు తన శరీరం పైన ఉన్న ఆభరణాలను, నాగుపాముని వదిలేసినా...

శివుడు అమర్ నాథ్ గుహకి వెళ్లేప్పుడు తన శరీరం పైన ఉన్న ఆభరణాలను, నాగుపాముని వదిలేసినా స్థలం ఎక్కడ

0

శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు ఆదిశేషుడు. శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. శ్రీమహావిష్ణువు శయనించే ఆదిశేషునికి ఇక్కడ ఒక ఆలయం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mahavishnu Temple In Jammu Kashmir

జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో అనంత నాగ్ అనే ప్రాంతంలో ఆదిశేషుని ఆలయం ఉంది. ఈ ప్రాంతం కశ్యప మహర్షి తపస్సు చేసిన స్థలంగా, ఆదిశేషుని తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రఘనాధ మందిరం అనే ఒక ప్రాచీన ఆలయం ఉంది. ఇక్కడ ఆశ్చర్యంగా 11 ముఖాలతో శివుడు దర్శనమిస్తుంటాడు. ఇక్కడ వేడి నీటి ఊటలు ఉండగా, భక్తులు ఇందులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు.

ఇక శివుడు అమర్ నాథ్ గుహకి వెళ్లేప్పుడు ఈ ప్రాంతంలోనే తన శరీరం పైన ఉన్న ఆభరణాలను, నాగుపాముని వదిలేసాడని అందుకే ఈ ప్రాంతానికి అనంత అనే పేరు వచ్చినదని చెబుతుంటారు. ఇంకా ఈ ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మార్తాండ్ సూర్యదేవాలయం ఉంది. అద్భుత నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం నుండి చుస్తే కాశ్మీర్ లోయ అంత కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడి సూర్యదేవాలయం చుట్టూ దాదాపుగా మొత్తం 84 చిన్న దేవాలయాలు ఉన్నవి. ఈ ఆలయంలో అద్భుత శిల్పకల మనకి కనిపిస్తుంది.

ఈ ఆలయాన్ని కర్కోటక రాజ్యానికి చెందిన లలితాదిత్య క్రీ.శ. 8 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. కానీ 15 వ శతాబ్దంలో అప్పటి సుల్తాన్ ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వసం చేసాడు. దాదాపు అప్పటి కాశ్మీర్ సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వసం చేయడానికి ఒక సంవత్సర సమయం పట్టిందట. ప్రస్తుతం ఈ ఆలయం శిధిలావస్తలో ఉన్నప్పటికీ ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా మారింది.

Exit mobile version