ఒక్కొక్క రంగు మనలో ఒకొక్క గ్రంధిని ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎరుపు రంగు పంచ భూతాలలో ఒకటైన అగ్నికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రంగు ఆకలిని, దాహాన్ని పెంచుతుంది. అందుకే చైనా లోని రెస్టారెంట్ గోడలపై ఎక్కువగా ఎరుపురంగు వేస్తుంటారు. నీలిరంగు ఆకలిని తగ్గిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు తమ డైనింగ్ రూమ్ లో గోడలకి నీలిరంగు వేసుకుంటే ఆకలి తగ్గిపోయి, తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇక సంతోషంగా భోజనం చేయాలంటే డైనింగ్ రూమ్ గోడలపై పసుపు పచ్చ రంగు వేసుకోవాలి. అది ప్రశాంతతని పంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు (బ్లడ్ ప్రెజర్) తమ ఇళ్లల్లో గోడలకు తెలుపు రంగు వేయించుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఆకుపచ్చ రంగుకి రోగాలను నయం చేసే గుణం ఉంది. అందుకే ఇంటినిండా పచ్చని మొక్కలు పెంచుకోవాలి.