Home Unknown facts Mana sampradhayaamlo panchamuthraniki vunna vishesham yenti?

Mana sampradhayaamlo panchamuthraniki vunna vishesham yenti?

0

గుడిలో దేవుడికి అభిషేకం చేయడానికి మరియు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పంచామృతాన్ని చేస్తుంటారు. దేవాలయాలలో దోషాల నివృత్తి కోసం పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు. అయితే ఇలా దేవుడికి అభిషేకం చేయడానికి, లేదా ముఖ్య శుభకార్యం ఉన్నపుడు మనం పంచామృతాన్ని ప్రసాదం లాగా స్వీకరిస్తామని మాత్రమే మనకి తెలుసు. కానీ పంచామృతంలో ఏం ఉంటుంది? పంచామృతాన్ని చేయడానికి ఆ ఐదింటిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. panchamuthranikiపంచామృతంలో ఆ ఐదు ఔషదాలు ఏంటి అంటే, పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె. ఈ ఐదింటితో చేసిన దానినే పంచామృతం అని అంటారు. అయ్యప్ప స్వామికి, పరమేశ్వరుడికి పంచామృ తాలతో అభిషేకం చాలా ప్రీతికరం అందుకే శివుడును అభిషేకప్రియుడు అని అంటుంటారు. అయితే కొన్ని దోషాలకు నివారణగా పరమేశ్వరుడుకి రుద్రాభిషేకం, పంచామృతముతో అభిషేకాన్ని సూచిస్తారు పండితులు. పంచామృత తీర్థం తీసుకుంటే మనం అనుకున్న పనులు అఖండంగా పూర్తి అవుతుంది. మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆవు పాలు:ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.
పెరుగు:పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం.
నెయ్యి:మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.
తేనె:వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది.
పంచదార:పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
ఈవిధంగా పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె తో చేసిన ప్రసాదాన్ని పంచామృతం అనడానికి కారణం ఏంటి అంటే దేవతలు అమృతం తాగి మరణం అనేది లేకుండా చేసుకున్నారు. అలానే కలియుగంలో ఈ పంచ ఔషదాలతో చేసిన ఈ ప్రసాదాన్ని తింటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశం తో దీనికి పంచామృతం అని పేరు పెట్టారని చెబుతారు.

Exit mobile version