హిందూ ధర్మంలో దీపానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. మన సంప్రదాయంలో ప్రతి రోజు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు. ఏ శుభకార్యం చేయాలన్న కచ్చితంగా దీపం అనేది ఉంటుంది. అందుకే దీపాన్ని జ్ఙాన దీపం అని అంటారు. ఇది ఇలా ఉంటె ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి తల దగ్గర దీపం అనేది పెడుతుంటారు. మరి అలా తల దగ్గర ఎందుకు దీపాన్ని పెడతారు? దానికి కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం బతికి ఉన్నప్పుడు దీపం చీకటిలో ఎలా దారి చూపిస్తుందో అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా దీపం మోక్ష మార్గం చూపుతుందని చెబుతారు. అయితే మరణించిన తర్వాత వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుంచి బయటకు వస్తేనే వారి ఆత్మకు మోక్ష మార్గం దొరుకుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
అయితే మరణించిన తర్వాత బ్రహ్మ కపాలం నుంచి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మమోక్ష మార్గానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఉత్తరమార్గం, రెండోది దక్షిణ మార్గం. దక్షిణ మార్గంలో చీకటి ఉంటుంది. ఉత్తరమార్గంలో వెలుగు ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తల పక్కన ఉన్న దీపం ఉత్తరమార్గం వైపునకు వెళ్లడానికి దారి చూపిస్తుందని చెబుతున్నారు.
అయితే ఇలా తల దగ్గర ఉన్న దీపమే వెలుగు చూపించి సహాయం చేస్తుందని, అందుకే మరణించిన తర్వాత తల దగ్గర దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని పురాణాలూ చెబుతున్నాయి.