Home Unknown facts All You Need To About Why May Day Is Celebrated

All You Need To About Why May Day Is Celebrated

0

మే డే అంటే సెలవు దినంగా, కార్మికుల దినోత్సవంగా మనలో చాలా మందికి తెలుసు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే అంటే ప్రపంచంలోని కార్మికులందరూ కలసి కష్టపడి సాధించుకున్న విజయ సూచిక మే డే. ఆనాడు కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడారు. ప్రాణాలు సైతం త్యాగం చేసి కార్మిక ప్రపంచానికి చీకటిని చెరిపేసి వెలుగునందించారు. మరి మొదటగా మే డే ఎప్పుడు జరుపుకున్నారు? కార్మికులు దేనికోసం పోరాడారు? కార్మికుల కష్టం కోసం పోరాడింది ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.may dayమే డే ని అంటే మే 1 వ తేదిని కార్మికులు పండుగ దినంగా భావిస్తారు. ఎందుకంటే 19 వ శతాబ్దం వరకు కూడా కార్మికులు రోజుకి కనీసం 18 నుండి 20 గంటలు గొడ్డు చాకిరీ అనేది చేసేవారు. ఇలా పెట్టుబడిదారులు గొడ్డు చాకిరీ చేయించుకుంటూ దానికి తగిన వేతనం కూడా చెల్లించకుండా వారిని బానిసలుగా చూసేవారు. ఈవిధంగా కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి మార్క్సిస్టు మూల పురుషుడు కార్ల్‌ మార్క్స్‌ ప్రపంచ కార్మికులకు ఉద్యమం చేయాలంటూ పిలుపునిచ్చాడు. ఇక మొట్ట మొదటిసారిగా 1806 వ సంవత్సరంలో కార్మికులు తిరుగుబాటు అనేది చేసారు. బ్రిటన్ లో ప్రారంభం అయినా ఈ తిరుగుబాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా, జర్మనీ వంటి దేశాలకి విస్తరించింది. వీరు 8 గంటలు పనిదినం, 8 గంట నిద్ర, 8 విశ్రాంతి కావాలంటూ ఉద్యమించారు. ఈ సమ్మెకు ప్రభావితమైన ప్రభుత్వ ఉద్యోగులు, 1828లో పది గంటల పనికోసం సమ్మె ప్రారంభించారు. ఈ పోరాటాలు ప్రపంచంలోని కార్మికులకు దిక్సూచి అయ్యాయి. 1840లో అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులు 10 గంటల పని దినం కోసం సమ్మె చేస్తే ప్రభుత్వం దిగివచ్చి చట్టం చేయవల్సి వచ్చింది. దీనితో 1858లో 8 గంటల పనిదినం కావాలనీ ఆందోళన ప్రారంభమయ్యింది. ఆ తరువాత చికాగో నగరంలో 1886 మే 1 వ తేదీన కార్మికుల హక్కు కోసం భారీ నిరసన ప్రదర్శన అనేది చేసారు. అయితే కార్మికులు చేస్తున్న ఈ ర్యాలీని చెదరగొట్టాలనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం పోలీసులని రంగంలోకి దింపగా వారు జరిపిన కాల్పులలో కొందరు కార్మికులు మరణించారు.

ఈ మారణహోమానికి నిరసనగా చికాగో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పటికే తోటి కార్మికులు చనిపోయారన్న ఆందోళనతో ఉన్న కార్మికులకు అక్కడి పోలీసుల చర్యల కారణంగా కార్మికులు మరింత ఉధృతంగా సమ్మె పోరాటాలు చేశారు. దాంతో మరింత రెచ్చి పోయిన ప్రభుత్వం సమ్మెకు నాయకత్వం వహిస్తున్న నలుగురు చికాగో కార్మికులకు ఉరిశిక్ష విధించింది. ఇలా కార్మికుల రక్తంతో తడిసి ముద్దై ఆవిర్భవించినదే అరుణపతాకం. అయితే కొన్ని దశాబ్దాలుగా పెట్టుబడిదారుల వద్ద బానిసలుగా గొడ్డు చాకిరీ చేస్తూ ఒక దేశంలో మొదలైన కార్మికుల పోరాటం మెల్లిగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి కార్మిక హక్కుల కోసం పోరాడి చివరకి చికాగో అమరవీరుల త్యాగఫలితంగా 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ ప్రథమ మహాసభలో ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించిన విజయ చిహ్నంగా మే 1వ తేదీని నేడు మే డే గా పిలుచుకుంటున్నాం. ఇక మన దేశంలో మొదటిసారి 1923 లో మే డే ను పాటించడం జరిగింది. మే 1 వ తేదీ అంటే కార్మికుల దినోత్సవంగా, కార్మికుల శ్రమను గౌరవించినందుకు వేడుకే మేడే.

Exit mobile version