Home Unknown facts ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

పరమశివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చే అతి పురాతన, అద్భుతమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇదేనని చెబుతారు. ఈ ప్రదేశం దర్శనం ఒక అద్బుతమనే చెప్పవచ్చు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది. ఈ ఆలయ విశేషాలు ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva

ఉత్తరాఖండ్, రుద్రప్రయాగ జిల్లా లో చొప్త అనే ఒక అందమైన హిల్ స్టేషన్ ఉంది. అయితే చొప్త నుండి 4 కీ.మీ. దూరంలో తుంగ్నాద్ ఆలయం ఉంది. ఈ ప్రదేశం శివుడికి అంకితం చేయబడినదిగా చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. సముద్రమట్టానికి దాదాపుగా 3680 కిలోమీటర్ల దూరంలో తుంగ్నాద్ పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరం పైనే ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇదేనని చెబుతారు.

పురాణానికి వస్తే, రామాయణంలో రావణుడు ఈ ప్రదేశంలోనే తన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని పురాణం. ఇంకా పాండవులు శివుడిని అనుగ్రహం కోసం ఈ శిఖరం పైకి వచ్చి పంచ కేదారాలు నిర్మించారని చెబుతారు. చోప్రా హిల్ సముద్రమట్టానికి దాదాపుగా 2680 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఇక్కడ ఛఖుంబ, త్రిశులు మరియు నందాదేవి వంటి గొప్ప పర్వత శ్రేణులను దర్శించి భక్తులు గొప్ప అనుభూతుని పొందుతారు.

ఇక్కడ అలకనంద, మందాకిని నదులు ఇక్కడ ప్రవహిస్తుంటాయి. అయితే ఎప్పుడు మంచు ఉండే ఈ ఆలయాన్ని దర్శించాలంటే సరైన సమయం మార్చి నుండి అక్టోబర్. ఇక్కడికి దగ్గరలోనే చంద్రకిలా శిఖరం ఉంది. ఇక్కడ శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం పోవడానికి శివుడిని పూజించాడని చెబుతారు. రుద్రప్రయాగలోనే కోటేశ్వర్ అనే ఆలయం కూడా ఉంది. అయితే శివుడు కేదార్నాథ్ వెళ్లే దారిమద్యలో ఈ ప్రాంతంలో యోగ ధ్యానం చేసాడని చెబుతారు.

ఇలా మంచు కొండల్లో వెలసిన ఈ ఆలయ దర్శనం, ఆ కొండ శిఖరాల అద్భుతం ఎంత చుసిన కూడా తనివితీరదనే చెప్పాలి.

Exit mobile version