Home Unknown facts శివుడు ప్రతిష్టించిన ఆ శివలింగం ఎక్కడ ఉంది? లింగాన్ని ఎందుకు ప్రతిస్టించారో తెలుసా ?

శివుడు ప్రతిష్టించిన ఆ శివలింగం ఎక్కడ ఉంది? లింగాన్ని ఎందుకు ప్రతిస్టించారో తెలుసా ?

0

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉండగా అందులో ఉండే శివలింగాన్ని పురాణాల ప్రకారం దేవతలు, మునులు, రాజులూ ప్రతిష్టించారని చెబుతారు. అయితే ఈ ఆలయం లో విశేషం ఏంటంటే, ఇక్కడి శివలింగాన్ని స్వయానా ఆ పరమశివుడే ప్రతిష్టించారని ఈ శివలింగం ఎంతో మహిమగలదని చెబుతారు. మరి శివుడు ప్రతిష్టించిన ఆ శివలింగం ఎక్కడ ఉంది? ఇక్కడ లింగాన్ని ఎందుకు ప్రతిష్టించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva Enshrined Shivalinga

తమిళనాడు రాష్ట్రం, కుంభకోణానికి దగ్గరలో తిరువిడైమరుదూర్ అనే శివాలయం ఉంది. ఇక్కడే శివుడే స్వయానా శివలింగాన్ని ప్రతిష్టించాడను కనుక ఈ లింగాన్ని మహాశివలింగం అని పిలుస్తారు. ఈ ఆలయం అతి పురాతనమైనది. ఇక్కడి ఆలయ రాతి కట్టడం చోళరాజుల నిర్మించారు. అయితే సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని పురాణం. అయితే పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడాడు కనుక ఈ లింగానికి మహాలింగం అనే పేరు వచ్చినది అని చెబుతారు.

ఈ ఆలయ పరిసరాలలో చాలా అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు ఉంటాయి. ఇటువంటి చెట్లు కేవలం శ్రీశైలం మల్లికార్జుని సన్నిధిలో మాత్రమే చూడవచ్చు. ఇంకా ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టూ నాలుగు శివాలయాలు ఉండగా మధ్యలో ఈ ఆలయం ఉండటం వలన దీనిని పంచలింగ స్థలం అని అంటారు.

ఇలా ఎంతో మహిమ గల ఈ ఆలయం చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసివారికి ఏ విధమైన మానసిక బాధలైనా తొలగి పోతాయని, అంతేకాకుండా వివాహం, పిల్లలు, ఉద్యోగం ఇలా సకల కోరికలూ నెమరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Exit mobile version