Home Unknown facts దుర్గాదేవిని ఈ ఆలయంలో ఝులాదేవి అని కొలుస్తారు ఎందుకు ?

దుర్గాదేవిని ఈ ఆలయంలో ఝులాదేవి అని కొలుస్తారు ఎందుకు ?

0

శివ పార్వతులు వెలసిన ఈ రెండు ఆలయాలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలుగా ప్రాచుర్యం పొందినవి. ఇక్కడ శివుడిని బింసర్ మహాదేవ్, పార్వతిని ఝులాదేవి అని కొలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bimsar MahaDevఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లాలో రాణిఖేత్ ఉంది. అల్మోరా నగరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఝులాదేవి, బింసర్ మహాదేవ్ అనే రెండు ఆలయాలు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలు కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలుగా ప్రాచుర్యం పొందినవి.

ఝులాదేవి ఆలయం 8 వ శతాబ్దంలో నిమరించారు. దుర్గాదేవిని ఈ ఆలయంలో ఝులాదేవి అని కొలుస్తారు. ఈ దుర్గాదేవిని దర్శించడానికి భక్తులు అనేక దూర ప్రాంతాల నుండి వస్తారు.

రాణిఖేత్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో బింసర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో బింసర్ మహాదేవ్ అనగా శివుడు. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయం చుట్టూ కూడా దేవదారు అడవులు మరియు ఒక సహజ నీటి బుగ్గ ఉన్నాయి.

ఇది ఇలా ఉంటె, రాజా పురందర దేవ్ భార్య రాణి పద్మినికి ఇది చాల ఇష్టమైన ప్రదేశం. అందుకే ఈ ప్రాంతానికి రాణిఖేత్ అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇది ఈ నగరంలోనే అత్యంత సుందరమైన కొండ ప్రాంతం. 1869 లో ఈ స్థలాన్ని చుసిన బ్రిటిష్ వారు ఈ కొండప్రాంతాన్ని వేసవి ప్రాంతంగా మార్చుకున్నారని చెబుతారు.

ఈవిధంగా హిమాలయ మంచుతో బాగా కప్పబడిన శ్రేణులతో నిండి, ఈ పర్వత ప్రాంతం సముద్ర మట్టానికి 1869 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలపైన ఉంది. ఈ ప్రసిద్ధ రెండు ఆలయంలో వెలసిన పార్వతి పరమేశ్వరులను దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఎప్పుడు తరలివస్తుంటారు

Exit mobile version