Home Unknown facts ఒకే రాతితో భూమిలోపల ఏర్పడ్డ శివుడి గుహ

ఒకే రాతితో భూమిలోపల ఏర్పడ్డ శివుడి గుహ

0

మన దేశంలో ఎన్నో అద్భుత శివాలయాలు అనేవి ఉన్నవి. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ శివాలయం ఒకే రాతితో భూమిలోపల నిర్మించబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం, ఇక్కడ ఉన్న నందిమంటపం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఈ శివాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

pathaleshwaa mahadevపూణే లో పాతాళేశ్వర్ గుహాలయం ఉంది. ఇక్కడ భూగర్భంలో శివుడు కొలువై ఉండగా, ఇక్కడ ఇలా వెలసిన శివుడికి పాతాళేశ్వర్ మహాదేవ్ అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న నందిమంటపం ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇంకా ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఈ గుహాలయం ఏకరాతి నిర్మాణం అని చెబుతారు.

ఈ ఆలయం 8 వ శతాబ్దానికి చెందినది అని చెబుతుండగా, పూర్వం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆలయాన్ని కొన్ని గంటల్లో నిర్మించి ఇక్కడే కొన్ని రోజులు శివుడికి పూజలు చేసారని స్థల పురాణం.

ఇక ఎంతో అందంగా నిర్మించిన ఈ గుహాలయం భక్తులకి విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ సీతారామలక్ష్మణులు, గణపతి, లక్ష్మి దేవి కి విడిగా కొన్ని ఆలయాలు అనేవి ఉన్నవి. ఇక్కడ ఉన్న ఈ గుహాలయం ఎల్లోరా రాతి గుహాలని పోలి ఉండటం విశేషం. ఈవిధంగా ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా భూగర్భంలో దర్శనమిచ్చే పాతాళేశ్వర్ మహాదేవ్ అని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version