Home Unknown facts అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠికాంబదేవి వెలసిన అద్భుత ఆలయం

అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠికాంబదేవి వెలసిన అద్భుత ఆలయం

0

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతుంటారు. ఇక్కడ పాదగయ క్షేత్రానికి చాలా విశిష్టత ఉన్నదీ. ఇక్కడి ఆలయంలో పీఠికాంబదేవి పూజలందుకొంటుంది. అయితే ఇక్కడ పిఠాపురం అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడి ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

holy power centric

ఆంధ్రపద్రేశ్ర్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన పిఠాపురం మండలంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం కలదు. ఈ ఆలయం చాల ప్రాచీనమైంది. పూర్వం ఈ పిఠాపురాన్ని పిష్ఠపురమని పిలిచేవారు. ఇచట పీఠికాంబదేవి వెలసింది కాబట్టి పీఠికాపురంగా పిలువబడుతూ రాను రాను అది పిఠాపురంగా మారింది. దత్తాత్రేయుడి జన్మస్థలం ఇదే అని చెబుతారు.

ఇక పురాణానికి వస్తే, దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవీ ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీమహావిష్ణువుని ఆజ్ఞాపించింది.

అమ్మ ఆనతిమేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా, అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయనీ, ఇలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయనీ పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధిచెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదవది. పురూహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది.

ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు కాశీ విశిష్టతను తెలియజేసేవిధంగా ఉంటాయి. దసరా నవరాత్రుల్లో పురూహుతికా అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. పాదగయ క్షేత్రంలో నిత్యం 200 మందికి అన్నదానం చేస్తారు. అలాగే దుర్గామాలధారణ చేసిన భక్తులకు ఇక్కడ భోజన సదుపాయం ఉంటుంది.

పూర్వికులకు శైవక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. పాదగయ పుష్కరిణిలో స్నానమాచరించి పిండ ప్రదానాలు ఇచ్చేందుకు దేశం నలుమూలల నుంచీ చాలామంది ఇక్కడికి వస్తుంటారు. శివనామస్మరణలతో నిత్యం మార్మోగే ఈ క్షేత్రం గయాసురుడి పాదాలకు సాక్ష్యంగా నిలిచి పాదగయగా కీర్తికెక్కింది.

ఈవిధంగా అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో పదవ పీఠంగా పిఠాపురంలో వెలసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది

Exit mobile version