Home Unknown facts Pradakshina valana kalige laabam enti? endhuku chestaru?

Pradakshina valana kalige laabam enti? endhuku chestaru?

0

గుడికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించుకునే ముందు మనం గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తరువాత గుడిలోకి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటాం. ఇంకా ఇంట్లో పూజ చేసినప్పుడు ఆత్మ ప్రదక్షిణం చేస్తాం. అయితే అసలు ప్రదక్షిణ అంటే ఏంటి? ఎందుకు మనం ప్రదక్షిణ చేయాలి? దానివలన మనకి కలిగే లాభం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.pradakshinaభూమి, గ్రహాలు రెండు రకాలుగా తిరుగుతాయి. ఒకటి తన చుట్టూ తాను తిరగటం. రెండవది సూర్యుని చుట్టూ తిరగటం. దానితో రెండు రకాలైన అయస్కాంత శక్తులు వస్తాయి. సూర్యుడికి గ్రహాలకి ఉన్న పరస్పర ఆకర్షణా శక్తి కారణంగా అవి అంతరిక్షంలో చెల్లా చెదరు కాకుండా తమ తమ నిర్దిష్ట కక్ష్యలలో తిరుగుతాయని మనకి తెలిసిన విషయమే. వాటికి ఆ ఆకర్షణ శక్తి రావటానికి తమ చుట్టూ తాము తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటమే కారణం. అయితే సూర్యుని చుట్టూ తిరగటం వల్ల సౌర శక్తి కారణంగా గ్రహాలు శక్తివంతాలవుతున్నాయి. తమ చుట్టూ తాము తిరగటం వల్ల తమలోని శక్తిని ప్రచోదనం చెయ్యటం లేక ఉత్తేజ పరచటం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని భ్రమణం అని, సూర్యుని చుట్టూ తిరగటాన్ని పరిభ్రమణం అని అంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే, భూమి ఏ విధంగా నయితే శక్తిని పొందుతోందో అదే విధంగా భూమిపై జీవిస్తున్న మనిషి కూడా భ్రమణం, పరిభ్రమణం చేస్తే శక్తిమంతుడవుతాడు. ప్రతి మనిషి లోనూ దైవ శక్తి అంతర్నిహితంగా ఉంటుంది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది. దానిని కేంద్ర బిందువుగా చేసుకుని తిరగటం వల్ల అయస్కాంత శక్తి కలుగుతుంది. ప్రదక్షిణంలో తనకన్న ఎక్కువ శక్తి గల దాని చుట్టూ తిరగటం ద్వారా శక్తి మంతులు కావటం ఉంటుంది. గ్రహాలన్ని శక్తికి నిధానమైన సూర్యుని చుట్టూ తిరిగి శక్తిని పొందుతాయి . అలాగే మనిషి దైవం చుట్టూ తిరిగి అంటే ప్రదక్షిణం చేసి తనలో దైవ శక్తిని పెంపొందించుకుంటాడు. దేవాలయంలో గర్భగుడి ధ్వజ స్తంభాల చుట్టూ ఉంటుంది ప్రదక్షిణం. అరుణాచలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు. దానిని గిరి ప్రదక్షిణం అంటారు. దీనిని మొదట ప్రారంభించింది శ్రీకృష్ణుడే అని చెప్పవచ్చు. ఇంద్రయాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు. దానివల్ల ఎంతటి సత్ఫలితం వచ్చిందో తెలుసు. అలాగే పెద్దలకి ప్రదక్షిణ చేయటం కూడా మేలు కలిగిస్తుంది. తల్లి తండ్రులకి ప్రదక్షిణం చేస్తే ఎంతటి ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుందో గణపతి కథ మనకి తెలియ చేస్తుంది. అందుకే మనలో శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రదక్షిణ చేయాలనీ మన పురాణాలూ చెబుతున్నాయి.

Exit mobile version