Home Unknown facts Raavanudi Gurinchi Thappaka telusukovalsina 7 Nijalu

Raavanudi Gurinchi Thappaka telusukovalsina 7 Nijalu

0

దసరా పండుగ అనగానే రావణాసుర వధ మన అందరికి గుర్తొచ్చే విషయం. రామాయణం లో రావణుడు అనగానే నీచమైన బుద్ధి గల ఒక రాక్షసుడిగా చెప్పుకుంటారు. మన పూర్వీకుల దగ్గరి నుండి మన తరం వారకి కూడా రామాయణం అంటే సీతని అపహరించినందుకు రావణుడిని వధించి సీత దేవిని కాపాడుకొని అయోధ్య నగర రాజుగా పట్టాభిషేకుడై రాముడు దేవుడిగా నిలిచాడు.
రామాయణ కథలో రావణుడి పాత్రని పక్కన పెడితే ప్రతి మనిషిలో మంచి చెడు అనేది ఉంటుంది. రావణుడిలో మంచి ఎంత చెడు ఎంత అనేది కాకుండా మనం ఎలా అయితే రాముడిని దేవుడిగా పూజిస్తామో అదేవిధంగా లంకాధిపతి అయినా రావణుడిని కూడా ఇప్పటికి చాలా మంది దేవుడిగానే ఆరాధిస్తున్నారు.
రావణుడి గురించి నమ్మలేని కొన్ని నిజాలు ఏంటో ఇప్పుడు ఒకేసారి తెలుసుకుందాం.
1. లంకాధిపతి:raavanaరావణుడికి కొన్ని క్రూరమైన సిద్ధాంతాలు ఉన్నపటికీ లంకాధిపతిగా ఒక రాజు గా లంక ప్రజల సుఖ సంతోషాలు కోరుతూ వారికీ ఎప్పుడు అండగా ఉంటూ వారి మెప్పు పొంది ఆరాధ్య దైవంగా నిలిచాడు.
2. బ్రహ్మ దేవుడి మనువడు:రావణుడి యొక్క తండ్రి పేరు “విస్రవాస్”. ఈయన ఒక గొప్ప రుషి. విస్రవాస్ గారి యొక్క తండ్రి గారు బ్రహ్మ యొక్క పదిమంది మనోభావ పుత్రులలో ఒకరు అయినా “ప్రజాపతి పులస్త్యా”. రావణుడు మహా విష్ణువు మరియు దైత్యా రాణి కైకెసీకి జన్మించాడు, అది అతనికి పాక్షికంగా బ్రాహ్మణ మరియు పాక్షికంగా దైత్యా అని చేసింది.
3.రావణుడు రాముడి కోసం ఒక యజ్ఞం చేసాడురాముడు తన సేన తో కలసి లంకకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వారధి నిర్మాంచాడానికి ముందు పూజ కార్యక్రమానికి రావణుడిని ఆహ్వానించారు. ఆ పూజ లో శివుడిని పూజిస్తారు. రావణుడు శివుడికి గొప్ప భక్తుడు అందువలన శివుడిని గౌరవించే పనులను తిరస్కరించలేడు.
4. రావణ వీణ వాయించడంలో నేర్పరిమనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో రావణుడు వీణ తో కనిపిస్తాడు. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం వీణ ని చాలా గొప్పగా వాయిస్తాడు.
5.రావణుడు సూర్యోదయాన్ని నియంత్రిస్తాడు కొన్ని సవంత్సరాల తపస్సు మరియు అంకితభావంతో రావణుడు సూర్యోదయం మరియు సూర్యాస్తమయాన్ని నిజంగా నియంత్రించగలిగినంత శక్తి తనలో ఉందని చెప్పుతున్నారు. అంతేకాకుండా తన కొడుకు మేఘనాధుడు జన్మించే సమయంలో శిశువు యొక్క అమరత్వం కోసం ‘గ్రహాలను’ ఒక నిర్దిష్ట వరుసలో ఉంచాడంటా.
6. 10 తలల రావణుడు శివుడిని ఆరాధిస్తూ తన తలని తానే ముక్కలుగా చేసుకోగా, తనలో ఉన్న భక్తి మూలాన ఒక్కో భాగం ఒక తల గా కలసి 10 తలలు వచ్చాయని చెప్పుతారు.
7.అతనికి తన మృత్యువు గురించి ముందే తెలుసుఒక ఉద్దేశం వలన భూమిపైకి వచ్చాను అని రావణుడికి తెలుసు. విష్ణు అవతారంలో ఉన్న వ్యక్తి చేతిలో చనిపోవడం అదృష్టమని అప్పుడే తనకి మోక్షం లభిస్తుందని రావణుడికి ముందే తెలుసు.

Exit mobile version