Home Unknown facts వర్షాలను ముందుగానే అంచనా వేసే ఈ ఆలయం ఎక్కడ ఉంది?

వర్షాలను ముందుగానే అంచనా వేసే ఈ ఆలయం ఎక్కడ ఉంది?

0

మన దేశంలో అంతుచిక్కని అతి పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నవి. అలాంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఎందుకంటే ఈ ఆలయం లో సంవత్సరంలో వర్షాలు సరిగ్గా పడతాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వర్షాలను ముందుగానే అంచనా వేసే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని వాన గుడి అని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

photo of Rain Temple in india

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాన్పూర్ జిల్లా, భితర్‌గావ్ బెహతా అనే గ్రామంలో జగనాథుడి ఆలయం ఉంది. ఈ ఆలయం అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆలయ పై కప్పు అంటే సీలింగ్ నుండి రాలె నీటి బొట్టు పరిమాణాన్ని బట్టి ఆ సంవత్సరం వర్షాలు బాగా పడుతాయ లేదా కరువు ఏమన్నా ఏర్పడుతుందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

ఈవిధంగా ఆలయ పై కప్పు నుండి రాలె నీటి బిందువు పెద్దగా ఉంటె వర్షాలు బాగా కురుస్తాయని, చిన్నగా ఉంటె కరువు ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే ఇలా ఆలయం పై కప్పు నుండి నీరు ఎందుకు ఆలా పడుతుందనే విషయం తెలుసుకోవడానికి కొందరు పరిశోధకులు చాలా పరిశోధనలు చేసినప్పటికీ వారు కూడా దీనివెనుక కారణం ఏంటనేది మాత్రం స్పష్టంగా తెలుసుకోలేకపోయారు.

ఇక ఈ ఆలయ కట్టిన విధానమే చాలా ప్రత్యేకం అని అక్కడి స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయంలో జులై నెలలో జరిగే జగన్నాథ రథోత్సవాలు, జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రైతులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి ఆలయ పై కప్పు నుండి పడే నీటి బిందువులను చూస్తూ పూజలు కూడా నిర్వహిస్తుంటారు.

ఈవిధంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయం రుతుపవనాల గురించి ముందగానే తెలియచేస్తుండటంతో వాన గుడి గా ఈ ఆలయం చాలా పేరుగాంచింది

Exit mobile version